T20 World Cup 2022: T20 WCలో తొలి హ్యాట్రిక్ నమోదు..!

టీ20 ప్రపంచ కప్ లో భాగంగా మంగళవారం జరిగిన శ్రీలంక VS యూఏఈ మధ్య జరిగిన క్వాలిఫైయింగ్ మ్యాచ్ లో యూఏఈ బౌలర్ కార్తీక్ మెయప్పన్ సంచలనం సృష్టించాడు.

  • Written By:
  • Publish Date - October 18, 2022 / 05:36 PM IST

టీ20 ప్రపంచ కప్ లో భాగంగా మంగళవారం జరిగిన శ్రీలంక VS యూఏఈ మధ్య జరిగిన క్వాలిఫైయింగ్ మ్యాచ్ లో యూఏఈ బౌలర్ కార్తీక్ మెయప్పన్ సంచలనం సృష్టించాడు. ఈ మ్యాచ్ లో శ్రీలంక మొదట బ్యాటింగ్ చేయగా.. 15వ ఓవర్ లో మెయప్పన్ హ్యాట్రిక్ వికెట్లు తీశాడు.ఆ ఓవర్ లో వరుసగా 4, 5, 6 బంతుల్లో వరుసగా రాజపక్సా, అసలంక, శనకాను ఔట్ చేశాడు. కార్తీక్ మెయప్పన్ మొత్తం 4 ఓవర్లు బౌలింగ్ వేయగా.. 19 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ వరల్డ్ కప్ లో ఇదే తొలి హ్యాట్రిక్ కావడం విశేషం.

అయితే.. ప్రతిష్టాత్మక ఈ T20 వరల్డ్ కప్ లో బౌలర్లు హ్యాట్రిక్ వికెట్లు తీయడం అరుదు. అలాంటి రికార్డును యూఏఈ స్పిన్నర్ కార్తీక్ మెయప్పన్ శ్రీలంకపై సాధించి వరల్డ్ కప్ చరిత్రలో హ్యాట్రిక్ లు తీసిన వాళ్ల జాబితాలో చేరాడు. దీంతో టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో హ్యాట్రిక్‌ వికెట్లు తీసిన ఐదో ఆటగాడిగా మెయ్యప్పన్‌ రికార్డు సాధించాడు. అంతకుముందు బ్రెట్‌‌లీ (2007), కర్టిక్‌ కాంఫెర్‌ (2021), వానిందు హసరంగ (2021), కాగిసో రబాడా (2021) ఈమెగా టోర్నీలో వరుసగా మూడు వికెట్లు తీశారు.