South Africa T20 Squad: సౌతాఫ్రికా అంతర్జాతీయ జట్టులోకి 18 ఏళ్ళ కుర్రాడు

సౌతాఫ్రికా అంతర్జాతీయ జట్టులోకి 18 ఏళ్ళ కుర్రాడు ఎంట్రీ ఇచ్చాడు.ఐసిసి అండర్-19 ప్రపంచకప్ 2024లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా క్వేనా మఫాకా నిలిచాడు. ఆరు మ్యాచ్‌ల్లోనే 21 వికెట్లు తీశాడు. ఇందులో ఒక ఇన్నింగ్స్‌లో మూడు సార్లు ఐదు వికెట్లు తీయడం గమనార్హం.

Published By: HashtagU Telugu Desk
Kwena Maphaka

Kwena Maphaka

South Africa T20 Squad: వెస్టిండీస్‌తో ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల టీ20 ఇంటర్నేషనల్ సిరీస్ కోసం దక్షిణాఫ్రికా 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. 18 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ క్వేనా మఫాకా, ఆల్ రౌండర్ జాసన్ స్మిత్‌లు తొలిసారి దక్షిణాఫ్రికా జట్టులో చోటు దక్కించుకున్నారు.

ఐసిసి అండర్-19 ప్రపంచకప్ 2024లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా క్వేనా మఫాకా నిలిచాడు. ఆరు మ్యాచ్‌ల్లోనే 21 వికెట్లు తీశాడు. ఇందులో ఒక ఇన్నింగ్స్‌లో మూడు సార్లు ఐదు వికెట్లు తీయడం గమనార్హం. ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మఫాకా ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. ఇక జాసన్ స్మిత్‌కు దక్షిణాఫ్రికా దేశవాళీ క్రికెట్‌లో ఆడిన మంచి అనుభవం ఉంది. ప్రోటీస్ వైట్-బాల్ కోచ్ రాబ్ వాల్టర్ మఫాకా మరియు స్మిత్‌ల చేరికపై జట్టు కోచ్ వాల్టర్ తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశాడు.

జాసన్ స్మిత్ మరియు క్వేనా మఫాకా జట్టులోకి రావడంతో మేము సంతోషిస్తున్నాము. జాసన్ ఇటీవలి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి అతని బ్యాట్ మరియు బాల్‌ సామర్థ్యం మా జట్టుకు మరింత ఉపయోగకరంగా ఉండనుంది అని చెప్పాడు. అలాగే క్వెనాకు చాలా ప్రతిభ ఉంది. ఈ పర్యటన అతనికి విలువైన అంతర్జాతీయ అనుభవాన్ని పొందే అవకాశాన్ని ఇస్తుందని తెలిపాడు

డేవిడ్ మిల్లర్, తబ్రైజ్ షమ్సీ, కేశవ్ మహరాజ్, కగిసో రబడాలకు దక్షిణాఫ్రికా విశ్రాంతినిచ్చింది. వెస్టిండీస్ మరియు దక్షిణాఫ్రికా మధ్య మూడు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్ ఆగస్ట్ 23న జరుగుతుంది. తదుపరి రెండు మ్యాచ్‌లు వరుసగా ఆగస్టు 25 మరియు 27 న జరుగుతాయి. మూడు మ్యాచ్‌లకు ట్రినిడాడ్ ఆతిథ్యం ఇవ్వనుంది.

దక్షిణాఫ్రికా టి20 జట్టు:
ఐడెన్ మార్క్‌రామ్, ఒట్నీల్ బార్ట్‌మన్, నాండ్రే బెర్గర్, డోనోవన్ ఫెర్రీరా, జార్న్ ఫోర్టుయిన్, రీజా హెండ్రిక్స్, పాట్రిక్ క్రూగర్, క్వేనా మఫాకా, వియాన్ ముల్డర్, లుంగి ఎన్‌గిడి, ర్యాన్ రికిల్‌టన్, జాసన్ స్మిత్, ట్రిస్టన్ స్టబ్స్, లిజాడ్ విల్సేన్స్ వాన్.

Also Read: Independence Day 2024: నక్సలైట్ల ప్రభావిత ప్రాంతంలో తొలిసారిగా జెండా ఆవిష్కరణ

  Last Updated: 14 Aug 2024, 10:42 PM IST