Site icon HashtagU Telugu

Rahane 2.0: “రహానే 2.0”.. బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న వింటేజ్ ప్లేయర్

WTC Final 2023

Ajinkya Rahane

Rahane 2.0: అతనా…తీసుకోవడం దండగ..టెస్టుల్లో గొప్ప ప్లేయర్ కావొచ్చు…కానీ పొట్టి క్రికెట్ కు అతని ఆట సూట్ కాదు. ఇదీ ఐపీఎల్ వేలానికి ముందు అజింక్య రహానే గురించి పలు ఫ్రాంచైజీల అభిప్రాయం. అయితే రహానే విషయంలో ధోనీ లెక్క వేరే…అందుకే కనీస ధరకే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి తీసుకున్నాడు. యువ , సీనియర్ ఆటగాళ్ళ మధ్య రహానేకి చోటు దక్కడం కష్టమే అని చాలా మంది అంచనా వేశారు. మరి అందరిలా ఆలోచిస్తే అతని ధోనీ ఎందుకవుతాడు…ఏ ప్లేయర్ ని ఎక్కడ ఆడించాలో…ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలో ధోనీకి బాగా తెలుసు..అందుకే రహానే విషయంలోనూ ధోనీ లెక్క తప్పలేదు. జట్టులోకి తీసుకోవడమే కాదు రహానే ఆటతీరునూ మార్చేశాడు. ఇప్పుడు ఐపీఎల్ 16వ సీజన్ లో హాట్ టాపిక్ రహానే బ్యాటింగే…టెస్ట్ ప్లేయర్ , జిడ్డు బ్యాటింగ్ అంటూ తనపై ఉన్న ముద్రను చెరిపేస్తూ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు.

యువ ఆటగాళ్లతో పోటీపడుతూ మరీ ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోస్తున్నాడు. వెటరన్‌ ఆటగాడు, టెస్ట్‌ క్రికెటర్‌గా ముద్రపడ్డ అజింక్య రహానే కోల్ కత్తా పై ఆడిన తీరు వేరే లెవెల్లో ఉంది. టీ20లకు అస్సలు పనికిరాడు అనుకున్న రహానేలో ఇంత బ్యాటింగ్ ఉందా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. రహానే కేవలం 29 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 71 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు.ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఇదే స్థాయిలో మెరుపులు మెరిపించాడు. ఆ మ్యాచ్‌లో 27 బంతులు ఎదుర్కొన్న అతను.. 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేసి ఒంతిచేత్తో తన జట్టును గెలిపించాడు.

https://twitter.com/i/status/1650347569627774977

రహానే ఆటతీరు ఇలా మారిపోవడం వెనుక ధోనీ ముద్ర చాలానే ఉంది. టీ ట్వంటీలకు తగ్గట్టు తన బ్యాటింగ్ మార్చేశాడు. తనపై ఉన్న నమ్మకంతో టీమ్ లోకి తీసుకున్నందుకు కృతజ్ఞత చూపిస్తూ దూకుడైన బ్యాటింగ్ తో అదరగొడుతున్నాడు.
ఈ సీజన్ ఐపీఎల్ లో తాను ఆడిన మొదటి నాలుగు మ్యాచ్ ల్లోనూ అదరగొట్టిన రహానే.. తాజాగా కోల్ కతా నైటర్ రైడర్స్ పై క్లాస్ కు మాస్ టచ్ ఇస్తే ఫాస్ట్ బౌలర్లకు స్కూప్ షాట్లతో చుక్కలు చూపించాడు.ఓవర్‌కు సిక్సర్‌ లేదా ఫోర్‌ అన్నట్లుగా సాగింది అతని ఇన్నింగ్స్‌. 14 బంతుల్లో 19 పరుగులు చేసిన రహానే.. తాను ఎదుర్కొన్న చివరి 15 బంతుల్లో 60 పరుగులు బాదాడు. 5 ఇన్నింగ్స్ లలో 209 పరుగులు చేసిన రహానే.. ఏకంగా 199 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ సీజన్ లో అత్యధిక స్ట్రైక్ రేట్ రహానేదే. సీజన్ మొత్తం రహానే ఇదే ఫామ్ కొనసాగిస్తే వన్డే వరల్డ్ కప్ లో ఆడడం ఖాయంగా కనిపిస్తుంది.

Read More: MS Dhoni: ప్రేక్షకులకు ధన్యవాదాలు: ధోని

Exit mobile version