Travis Head Out For Duck: ట్రావిస్ హెడ్ (Travis Head Out For Duck) భారత జట్టుకు తలనొప్పిగా మారిన క్రమంలో నాలుగో టెస్టుపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. గత టెస్టులో భారీ సెంచరీతో ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన హెడ్ మెల్‌బోర్న్ టెస్టులో డకౌట్ తో వెనుదిరిగాడు. నిజానికి ఈ టెస్టుకు హెడ్ దూరం కావాల్సి ఉంది. గాయం కారణంగా అతను మెల్‌బోర్న్ టెస్ట్‌కు దూరంగా ఉండవచ్చని వార్తలు వచ్చాయి. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ హెడ్ ని జట్టులోకి తీసుకుని టీమిండియాకు తలనోప్పి తెప్పించాడు. అయితేనేం బుమ్రా ఆస్ట్రేలియాకు హెడేక్ తెప్పించాడు. హెడ్ ని డకౌట్ తో పెవిలియన్ కి చేర్చి జట్టుకు భారీ అపశమనం కలిగించాడు.
జస్ప్రీత్ బుమ్రా మూడో సెషన్‌లో ప్రమాదకరంగా బౌలింగ్ చేయడంతో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లకు చుక్కలు కనపడ్డాయి. ట్రావిస్ హెడ్ క్రీజులో కుదురుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. హెడ్ వికెట్ పడగానే భారత జట్టు సంబరాల్లో మునిగిపోయింది. విరాట్‌తో సహా ఆటగాళ్లందరూ బుమ్రాకు అభినందనలు తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వాస్తవానికి మొదటి రెండు సెషన్లలో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ సాధారణంగానే కనిపించింది. అతని బౌలింగ్ లో బ్యాట్స్‌మెన్ సులభంగా పరుగులు చేయగలిగారు. కానీ మూడో సెషన్‌లో బుమ్రా చెలరేగిపోయాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మిడిల్ ఆర్డర్‌ను షేక్ చేశాడు. మూడో సెషన్‌లో బుమ్రా హెడ్ మరియు మార్ష్‌లను ముందుగానే అవుట్ చేయడం ద్వారా భారత జట్టుకు బలమైన పునరాగమనం చేశాడు.
Also Read: Rohit Sharma: గల్లీ క్రికెట్ అనుకుంటివా పుష్ప .. జైస్వాల్ పై రోహిత్ ఆగ్రహం
ఈ మ్యాచ్‌లో 19 ఏళ్ల శామ్ కొంటాస్ ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేశాడు. మొదటి మ్యాచ్‌లోనే జస్ప్రీత్ బుమ్రా వంటి బౌలర్‌పై దాడి చేశాడు. బ్యాట్ తో పాటు విరాట్ కోహ్లీతో వాగ్వాదానికి దిగి హాట్ టాపిక్ గా మారాడు. ఈ క్రమంలో అర్ధ సెంచరీ నమోదు సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. సామ్ 65 బంతుల్లో 60 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 6 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు.