Site icon HashtagU Telugu

IPL 2024: సన్‌రైజర్స్ శిబిరంలో ట్రావిస్ హెడ్

Ipl 2024

Ipl 2024

IPL 2024: ఐపీఎల్ కు సమయం ఆసన్నమైంది. మరో వారంలో ఐపీఎల్ టోర్నీ ప్రారంభం కానుంది. మార్చి 22న తొలి పోరులో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు తలపడతాయి. చెన్నై చెపాక్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. విదేశీ ఆటగాళ్లు ఇప్పటికే తమ జట్టుతో కలుస్తున్నారు. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ శిక్షణా శిబిరంలో డాషింగ్ ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ చేరాడు.

ప్రపంచకప్‌ చివరి మ్యాచ్ లో ఆస్ట్రేలియా గెలవడంలో కీలక పాత్ర పోషించిన ట్రావిస్ హెడ్ ఆరేళ్ల తర్వాత ఐపీఎల్ ఆడనున్నాడు. దీంతో హెడ్ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఆడేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. మంచి సీజన్ కోసం ఎదురుచూస్తున్నాను. టీమ్ బాగుంది. జట్టు విజయం కోసం నేను పరుగులు అందించగలను ఆంటూ హెడ్ తెలిపాడు. హెడ్ ​​చివరిసారిగా 2017లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఐపీఎల్‌లో ఆడాడు.

ఎడమచేతి వాటం ఓపెనర్ హెడ్ ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ఆధ్వర్యంలో ఆడనున్నాడు. కమ్మిన్స్ ఐడెన్ మార్క్రామ్ స్థానంలో ఈ సీజన్‌కు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. కాగా ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ నాయకత్వంలో సన్ రైజర్స్ హైదరాబాద్ 2016లో టైటిల్‌ గెలుచుకుంది.

Also Read: Chandrababu: చంద్రబాబుతో గంటా శ్రీనివాస్ రావు, నారాయణ భేటీ