Travis Head: ఆస్ట్రేలియా సెన్సేషన్ ట్రావిస్ హెడ్ (Travis Head) టీమిండియాకు తలనొప్పిగా మారాడు. సాధారణ మిడిలార్డర్ బ్యాటర్‌గా కొనసాగిన హెడ్ ప్రస్తుతం ప్రపంచంలోనే విధ్వంసకర బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ భారత్ పై పూనకాలు వచ్చినట్టు చెలరేగిపోతున్నాడు. ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో సిరీస్ 1-1తో సమమైంది.
రెండో టెస్టులో ఆస్ట్రేలియా విజయంలో ట్రావిస్ హెడ్ కీలక పాత్ర పోషించాడు. అతని అద్భుత సెంచరీ ఆధారంగా ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ఇప్పుడు సిరీస్‌లో మూడో మ్యాచ్ గబ్బాలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో హెడ్ భారీ రికార్డుకు ఎసరు పెట్టాడు. గత కొన్నేళ్లుగా ట్రావిస్ హెడ్ టీమ్ ఇండియాకు తలనొప్పిగా మారాడు. భారత్‌తో జరిగిన అనేక ముఖ్యమైన మ్యాచ్‌లలో హెడ్ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలే ఇచ్చాడు.
Also Read: Vastu Tips: మనీ ప్లాంట్‌ని పెంచుకుంటున్నారా.. ఈ దిశలో పెడితే కష్టాలు చుట్టుముట్టడం ఖాయం!
ట్రావిస్ హెడ్ టీమ్ ఇండియాతో ఆడనున్న గబ్బా టెస్టులో కేవలం 45 పరుగులు చేస్తే అతని పేరు మీద మొత్తం టెస్టు క్రికెట్‌లో భారత్‌పై 1000 పరుగులకు చేరుకుంటుంది. ఇప్పటి వరకు ఏ జట్టుపైనా టెస్టు క్రికెట్‌లో 1000 పరుగుల సంఖ్యను హెడ్ టచ్ చేయలేకపోయాడు. ఈ జాబితాలో ఇంగ్లండ్ జట్టు రెండో స్థానంలో ఉంది. ఇంగ్లిష్ జట్టుపై హెడ్ 24 ఇన్నింగ్స్‌ల్లో 910 పరుగులు చేశాడు. ట్రావిస్ హెడ్ టీమ్ ఇండియాపై టెస్టు క్రికెట్‌లో 21 ఇన్నింగ్స్‌ల్లో 47.75 సగటుతో 955 పరుగులు చేశాడు. ఈ కాలంలో అతను 2 సెంచరీలు మరియు 4 అర్ధ సెంచరీలు సాధించాడు. అడిలైడ్ టెస్టులో హెడ్ రెండో సెంచరీ సాధించాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చివరి మ్యాచ్‌లో అతను తన మొదటి సెంచరీని సాధించాడు. అయితే టెస్టు క్రికెట్‌లో పాకిస్థాన్‌పై హెడ్ రాణించకపోవడం గమనార్హం. ఎందుకంటే ఈ విధ్వంసకర బ్యాట్స్ మెన్ పాకిస్థాన్‌పై 14 ఇన్నింగ్స్‌ల్లో 295 పరుగులు మాత్రమే చేశాడు. అతని టెస్ట్ సగటు 22.69 మాత్రమే.