స్టార్ క్రికెటర్ ఇంట విషాదం..

Sikandar Raza : జింబాబ్వే టీ 20 కెప్టెన్ సికందర్ రజా కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన 13 ఏళ్ల తమ్ముడు ముహమ్మద్ మహ్దీ హీమోఫీలియాతో బాధపడుతూ కన్నుమూశాడు. ఈ వార్త క్రికెట్ ప్రపంచాన్ని కలచివేసింది. ఈ కష్ట సమయంలో రజాకు అండగా నిలుస్తున్నట్లు జింబాబ్వే క్రికెట్ బోర్డు తెలిపింది. టీ 20 వరల్డ్ కప్ ముందు ఈ విషాదం రజాకు తీరని లోటు. రానున్న టీ 20 వరల్డ్‌కప్‌లో జింబాబ్వే జట్టుకు రజా నాయకత్వం […]

Published By: HashtagU Telugu Desk
Sikandar Raza 13-year-old younger brother passes away

Sikandar Raza 13-year-old younger brother passes away

Sikandar Raza : జింబాబ్వే టీ 20 కెప్టెన్ సికందర్ రజా కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన 13 ఏళ్ల తమ్ముడు ముహమ్మద్ మహ్దీ హీమోఫీలియాతో బాధపడుతూ కన్నుమూశాడు. ఈ వార్త క్రికెట్ ప్రపంచాన్ని కలచివేసింది. ఈ కష్ట సమయంలో రజాకు అండగా నిలుస్తున్నట్లు జింబాబ్వే క్రికెట్ బోర్డు తెలిపింది. టీ 20 వరల్డ్ కప్ ముందు ఈ విషాదం రజాకు తీరని లోటు. రానున్న టీ 20 వరల్డ్‌కప్‌లో జింబాబ్వే జట్టుకు రజా నాయకత్వం వహించనున్నాడు.

  • హీమోఫీలియాతో కన్నుమూసిన రజా సోదరుడు
  • సంతాపం వ్యక్తం చేసిన జింబాబ్వే క్రికెట్
  • ఎమోషనల్ అయిన సికందర్ రజా

జింబాబ్వే టీ20 జట్టు కెప్టెన్ సికందర్ రజా కుటుంబంలో దుర్ఘటన చోటుచేసుకుంది. రజా చిన్న సోదరుడు ముహమ్మద్ మహ్దీ (13) మృతి చెందినట్లు జింబాబ్వే క్రికెట్ అధికారికంగా ప్రకటించింది. ఈ వార్త క్రికెట్ అభిమానులను తీవ్రంగా కలచివేసింది.

జింబాబ్వే క్రికెట్ విడుదల చేసిన ప్రకటనలో “జింబాబ్వే టీ20 కెప్టెన్ సికందర్ రజా కుటుంబానికి మా హృదయపూర్వక సంతాపం. ఆయన చిన్న సోదరుడు ముహమ్మద్ మహ్దీ డిసెంబర్ 29, 2025న హరారేలో 13 ఏళ్ల వయసులో కన్నుమూశారు. పుట్టినప్పటి నుంచి హీమోఫీలియా వ్యాధితో బాధపడుతున్న మహ్దీ ఇటీవల ఎదురైన ఆరోగ్య సమస్యల కారణంగా మృతి చెందారు. డిసెంబర్ 30న వారెన్ హిల్స్ సమాధి స్థలంలో అంత్యక్రియలు నిర్వహించారు” అని పేర్కొంది.

ఈ కఠిన సమయంలో జింబాబ్వే క్రికెట్ బోర్డు, ఆటగాళ్లు, సిబ్బంది అంతా రజా కుటుంబానికి అండగా నిలుస్తున్నారని ప్రకటనలో తెలిపారు. “అల్లా వారికి ధైర్యం, ఓదార్పు ఇవ్వాలి. మహ్దీ ఆత్మకు శాంతి చేకూరాలి” అంటూ సంతాపం వ్యక్తం చేశారు.

ఈ వార్తపై సికందర్ రజా కూడా సోషల్ మీడియాలో స్పందించారు. జింబాబ్వే క్రికెట్ పోస్టును షేర్ చేస్తూ బ్రోకెన్ హార్ట్ ఎమోజీని పోస్ట్ చేసి తన మనోవేదనను వ్యక్తం చేశారు. ఆ పోస్ట్ అభిమానుల్లో మరింత భావోద్వేగాన్ని రేపింది. ఈ వ్యక్తిగత విషాదం రజా కెరీర్‌లో కీలక దశలో చోటు చేసుకుంది. ఇటీవలే ఐఎల్‌టీ20 2025లో షార్జా వారియర్స్ తరఫున ఆడుతూ మంచి ప్రదర్శన కనబరిచారు. 10 మ్యాచ్‌ల్లో 171 పరుగులు చేయడంతో పాటు 10 వికెట్లు పడగొట్టి ఆల్‌రౌండర్‌గా తన విలువను చాటుకున్నారు.

ఇక ముందున్న అతిపెద్ద సవాల్ టీ20 వరల్డ్ కప్ 2026. ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీలో జింబాబ్వే జట్టుకు సికందర్ రజానే నాయకత్వం వహించనున్నాడు. రజా నాయకత్వం జింబాబ్వే విజయావకాశాలకు కీలకంగా మారనుంది. చిన్ననాటి నుంచే హీమోఫీలియా వ్యాధితో పోరాడిన సోదరుడి మృతి రజాకు తీరని లోటుగా మిగిలిపోయింది. ఈ కష్టసమయంలో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు, క్రికెటర్లు రజా కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేస్తున్నారు.

  Last Updated: 01 Jan 2026, 11:17 AM IST