Sara Lee Death : క్రీడా ప్రపంచంలో విషాదం.. WWE సూపర్ స్టార్ సారా లీ హఠాన్మరణం..!!

క్రీడా ప్రపంచంలో విషాదం చోటుచేసుకుంది. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్ టైన్ మెంట్ మాజీ రెజ్లర్ సారా లీ కన్నుమూశారు. ఆమె వయస్సు 30 సంవత్సరాలు.

Published By: HashtagU Telugu Desk
Sara

Sara

క్రీడా ప్రపంచంలో విషాదం చోటుచేసుకుంది. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్ టైన్ మెంట్ మాజీ రెజ్లర్ సారా లీ కన్నుమూశారు. ఆమె వయస్సు 30 సంవత్సరాలు. సారా మరణ వార్తను ఆమె తల్లి సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. సారా మరణ వార్త విన్న ఆమె అభిమానులు షాక్ కు గురయ్యారు. WWEతోపాటు అలెక్సా బ్లిస్, బెకీ లించ్, మిక్ ఫోలే వంటి పలువురు స్టార్స్ సంతాపం వ్యక్తం చేశారు. సారా లీ ఏడాదిపాటు డబ్ల్యూడబ్ల్యూఈలో ఆడారు. 2016లో జరిగిన లైవ్ ఈవెంట్ లో ఆమె హీల్స్ ప్రోమోలో ఆకట్టుకుంది. జనవరిలో సారా లీ మహిళల ట్యాగ్ టీమ్ మ్యాచ్ లో తన ఇన్ రింగ్ అరంగ్రేటం చేసింది. ఆ సమయంలో మాండీ రోజ్ కూడా ఈ షోలో పాల్గొంది.

WWE రియాల్టీ సిరీస్ టఫ్ ఎనఫ్ సీజన్ 6 విజేతగా సారా లీ నిలిచింది. 2016 చివరిలో సారా తన చివరి మ్యాచ్ ఆడింది. ఐదేళ్ల క్రితం మాజీ WWEసూపర్ స్టార్ వెస్లీ బ్లేక్ ను వివాహం చేసుకుంది.

  Last Updated: 07 Oct 2022, 02:18 PM IST