Site icon HashtagU Telugu

Divorced Cricketers: విడాకులు తీసుకున్న క్రికెటర్లు

Divorced Cricketers

Divorced Cricketers

Divorced Cricketers: హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్ విడాకుల తర్వాత నెటిజన్లు క్రికెటర్ల విడాకుల గురించి గూగుల్ లో సెర్చించడం మొదలుపెట్టారు. ఫైనల్ గా ఈ జాబితాలో స్టార్ క్రికెటర్లు ఉన్నారని తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు. 1987లో మహ్మద్ అజారుద్దీన్,నౌరీన్‌ పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నారు. .కొన్నాళ్ల తర్వాత బాలీవుడ్ నటి సంగీతా బిజ్లానీతో అజారుద్దీన్‌ డేటింగ్ చేశాడు. ఆ సమయంలో అజారుద్దీన్ కు ఇద్దరు కొడుకులు ఉన్నారు. అయితే సంగీతను పెళ్లాడేందుకు 1996లో నౌరీన్‌కు అజారుద్దీన్ విడాకులు ఇచ్చాడు. సంగీతతో కూడా వివాహం కూడా ఎక్కువ కాలం నిలవకపోవడంతో 2010లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.

జావగల్ శ్రీనాథ్ 1999లో జ్యోత్స్నను వివాహం చేసుకున్నాడు, అయితే జర్నలిస్టు మాధవి పాత్రావళితో పరిచయం ఏర్పడంతో 2007లో తన మొదటి భార్య జ్యోత్స్నకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత జావగల్ 2008లో మాధవిని రెండో పెళ్లి చేసుకున్నాడు.వినోద్ కాంబ్లీ 1998లో నోయెల్లా లూయిస్‌ను వివాహం చేసుకున్నాడు. దీని తర్వాత కాంబ్లీ ఆండ్రియా హెవిట్ అనే మహిళతో ప్రేమలో పడ్డాడు. ఆ తర్వాత మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు. దినేష్ కార్తీక్ తన చిన్ననాటి స్నేహితురాలు నికితా వంజారాను 2007లో వివాహం చేసుకున్నాడు. అయితే భారత క్రికెటర్ మురళీ విజయ్‌తో నికితా ఎఫైర్ నడుపుతున్నట్లు వార్తలు వచ్చాక కార్తీక్, నికితా 2012లో విడాకులు తీసుకున్నారు. నికిత చేసిన మోసం కార్తీక్ కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపింది. అతడిని కూడా టీమ్ ఇండియా నుంచి తప్పించారు.దినేష్ కార్తీక్ 2015 ఆగస్టులో భారత స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్‌ను వివాహం చేసుకున్నాడు.

2018లో మహ్మద్ షమీపై అతని భార్య హసిన్ జహాన్ వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇద్దరూ విడిపోయారు. మహ్మద్ షమీ, హసిన్ జహాన్‌లకు ఒక కుమార్తె కూడా ఉంది. హసిన్ జహాన్ షమీపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేసినప్పటికీ, బీసీసీఐ ఏర్పాటు చేసిన దర్యాప్తు కమిటీ అతనికి క్లీన్ చిట్ ఇచ్చింది. శిఖర్ ధావన్ ఆస్ట్రేలియాకు చెందిన అయేషా ముఖర్జీతో చాలా ఏళ్ల పాటు డేటింగ్ చేశాడు. అయితే 2012లో వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.ఆయేషాకు ఇంతకుముందే వివాహమై ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శిఖర్ మరియు అయేషాకు 10 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు, అతని పేరు జోరావర్. ధావన్ 2015 నుంచి తన కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియాలో నివసిస్తున్నాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య దూరం పెరగడం మొదలైంది. చివరకు 2023 అక్టోబర్‌లో ధావన్ విడాకుల పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు ఆమోదించింది.

Also Read: CM Revanth Reddy: ఢిల్లీకి రేవంత్, తెలంగాణకు రాహుల్