Sports Events: 2025వ సంవత్సరం క్రీడారంగంలో ఎంతో గుర్తుండిపోయే సంవత్సరంగా నిలిచింది. ఈ ఏడాది భారత పురుషుల జట్టు ఛాంపియన్స్ ట్రోఫీని, RCB తన మొదటి టైటిల్‌ను గెలుచుకోగా, నవంబర్ 2025లో భారత మహిళల జట్టు వన్డే ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది. ఇప్పుడు అందరి దృష్టి 2026 పైనే ఉంది. 2026లో జరగబోయే 10 ప్రధాన క్రీడా ఈవెంట్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి.
2026లో జరగబోయే 10 ప్రధాన క్రీడా టోర్నమెంట్లు
ICC పురుషుల టీ20 వరల్డ్ కప్
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 ఫిబ్రవరి 7 నుండి మార్చి 8 వరకు జరుగుతుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాయి. ఇందులో మొత్తం 20 జట్లు పాల్గొంటాయి.
FIFA వరల్డ్ కప్ (పురుషుల ఫుట్‌బాల్)
ఫుట్‌బాల్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే ఫిఫా వరల్డ్ కప్ 2026లో జరగనుంది. అమెరికా, కెనడా, మెక్సికోలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తాయి. ఇది జూన్ 11 నుండి జూలై 19 వరకు జరుగుతుంది.
Also Read: మహారాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా
ఐపీఎల్ (IPL) 2026
ఐపీఎల్ 2026 తేదీలు ఇంకా ఖరారు కాలేదు. అయితే ఎప్పటిలాగే మార్చి నెలలో ఈ మెగా లీగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే 10 ఫ్రాంచైజీలు తమ జట్లను సిద్ధం చేసుకున్నాయి.
వింటర్ ఒలింపిక్ గేమ్స్
ఇటలీలోని మిలన్, కోర్టినా నగరాలు ఈ వింటర్ ఒలింపిక్స్‌కు వేదిక కానున్నాయి. ఫిబ్రవరి 6 నుండి ఫిబ్రవరి 22 వరకు ఈ క్రీడలు జరుగుతాయి.
కామన్వెల్త్ గేమ్స్
స్కాట్లాండ్‌లోని గ్లాస్గో నగరం 2026 కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనుంది. జూలై 23 నుండి ఆగస్టు 2 వరకు ఈ టోర్నమెంట్ నిర్వహిస్తారు.
వింబుల్డన్ – టెన్నిస్
ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన టెన్నిస్ టోర్నీ వింబుల్డన్. యూకే ఆతిథ్యం ఇచ్చే ఈ పోటీలు జూన్ 29 నుండి జూలై 12 వరకు జరుగుతాయి.
ఆస్ట్రేలియన్ ఓపెన్
2026 సంవత్సరపు మొదటి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ జనవరి నెలలో మెల్‌బోర్న్‌లో ప్రారంభమవుతుంది.
UEFA ఛాంపియన్స్ లీగ్ ఫైనల్
ఫుట్‌బాల్ క్లబ్ జట్ల మధ్య జరిగే అత్యున్నత పోరు UEFA ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ మే 30, 2026న హంగేరీలోని బుడాపెస్ట్‌లో జరగనుంది.
ICC మహిళల టీ20 వరల్డ్ కప్
మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 జూన్ – జూలై నెలల్లో ఇంగ్లాండ్ వేదికగా జరగనుంది. మహిళా క్రికెట్ అభిమానులు దీని కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వింటర్ పారాలింపిక్ గేమ్స్
వికలాంగ క్రీడాకారుల కోసం నిర్వహించే వింటర్ పారాలింపిక్ గేమ్స్ ఇటలీలోని మిలన్‌లో మార్చి 6 నుండి మార్చి 15 వరకు జరుగుతాయి.
