Site icon HashtagU Telugu

Ben Stokes: డబ్బులు తీసుకున్నాడు.. స్వదేశానికి వెళ్లిపోయాడు.. వివాదాస్పదంగా బెన్ స్టోక్స్ తీరు!

Article

Article

Ben Stokes: ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్‌పై సీఎస్కే ఫ్యాన్స్ మండిపడుతున్నాయి. బెన్‌స్టోక్స్‌ను ఏకంగా రూ.16.25 కోట్లతో సీఎస్కే కొనుగోలు చేసింది. కానీ అతడు అడింది కేవలం 2 మ్యాచ్ లు మాత్రమే. 2 మ్యాచ్ లలో కేవలం 16 పరుగులు మాత్రమే చేశాడు. అంటే ఒక్కో పరుగులు సీఎస్కే యాజమాన్యం అతడకి రూ.కోటి చెల్లించదన్నమాట. ఐర్లాండ్, ఇంగ్లండ్ మధ్య టీ 20 మ్యాచ్ ఉండటంతో అతడి ఆడేందుకు స్వదేశానికి బెన్ స్టోక్స్ బయలుదేరాడు.

బెస్ట్ స్టోక్స్ స్వదేశానికి బయల్దేరినట్లు సీఎస్కే యాజమాన్యం స్పస్టం చేసింది. దీంతో బెన్ స్టోక్స్ పై సీఎస్కే ఫ్యాన్స్ మండిపడుతున్నారు. రూ.16 కోట్లు పెట్టి కొనుగోలు చేస్తే రెండు మ్యాచ్ లు ఆడి స్వదేవానికి వెళ్లిపోవడం ఏంటని సీరియస్ అవుతున్నారు. ఐపీఎల్‌లో ఆడటానికి కుదరనప్పుడు ముందే తప్పుకోవాల్సిందని, జట్టు కొనుగోలు చేసిన తర్వాత ఇలా వెళ్లిపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అంత డబ్బులు పెట్టి సీఎస్కే కొనుగోలు చేసినా లాభం లేకుండా పోయిందని అంటున్నారు. ఇలాంటి ఆటగాళ్లను అసలు తీసుకోకూడదని అంటున్నారు.

డబ్బులు పెట్టి కొనుగోలు చేసిన తర్వాత లీగ్ అయిపోయేవరకు ఆడాలని సీఎస్కే ఫ్యాన్స్ చెబుతున్నారు. కుదరనప్పుడు ఐపీఎల్ లో అసలు పేరు నమోదు చేసుకోకుండా ఉండాల్సిందని సీఎస్కే ఫ్పాన్స్ అంటున్నారు. ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ లా ఐపీఎల్ లో పేరు నమోదు చేసుకోకుండా ఉండాల్సిందని సూచిస్తున్నారు. బెన్ స్టోక్స్ ఐపీఎల్ ఆడటానికి వచ్చినట్లు లేదని, సమ్మర్ వొకేషన్ ఎంజాయ్ చేయడటానికి వచ్చినట్లు ఉందని అంటున్నారు.

అయితే ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఆటగాడు ఆడకపోయినా పూర్తి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో బెన్ స్టోక్స్ కు సీఎస్కే పూర్తి డబ్బులు చెల్లించింది. దీంతో డబ్బులు తీసుకున్న తర్వాత ఇప్పుడు బెన్ స్టోక్స్ స్వదేశానికి చెక్కేశాడు.