Site icon HashtagU Telugu

IND vs BAN: రేపు భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో వన్డే

IND vs BAN INDIA

India Team Virat

భారత్‌ (INDIA)తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో బంగ్లాదేశ్ విజయంతో శుభారంభం చేసింది. తొలి వన్డేలో భారత్‌పై బంగ్లాదేశ్ జట్టు ఒక్క వికెట్ తేడాతో ఉత్కంఠభరితంగా విజయం సాధించింది. ఇప్పుడు ఇరు జట్లు డిసెంబర్ 7న రెండో వన్డేలో తలపడనున్నాయి. తొలి మ్యాచ్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా భావిస్తుంది. రెండో వన్డేలో బంగ్లాదేశ్ ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది.

డిసెంబర్ 7న భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఒకవైపు ఈ మ్యాచ్‌లో తొలి వన్డేలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకునేందుకు టీమిండియా బరిలోకి దిగుతుండగా, మరోవైపు ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్‌ను గెలవాలనే సంకల్పంతో బంగ్లాదేశ్ జట్టు బరిలోకి దిగనుంది. భారత్-బంగ్లాదేశ్ (IND vs BAN) మధ్య మూడు వన్డేల సిరీస్‌లో రెండో మ్యాచ్ డిసెంబర్ 7 బుధవారం భారత కాలమానం ప్రకారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభమవుతుంది.

భారత్-బంగ్లాదేశ్ (IND vs BAN) మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఆదివారం ఢాకాలోని షేర్-ఎ-బంగ్లా నేషనల్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 1 వికెట్ తేడాతో భారత్‌ను ఓడించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 41.2 ఓవర్లలో 186 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ తరఫున కేఎల్ రాహుల్ అత్యధికంగా 73 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ తరఫున షకీబ్ అల్ హసన్ 5 వికెట్లు, ఇబాదత్ హుస్సేన్ 4 వికెట్లు తీశారు.

భారత్ నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన బంగ్లాదేశ్ 46 ఓవర్లలో 187 పరుగులు చేసి విజయం సాధించింది. బంగ్లాదేశ్ విజయంలో 38 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన మెహదీ హసన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. భారత్-బంగ్లాదేశ్ మధ్య మూడు వన్డేల సిరీస్‌లో రెండో మ్యాచ్ డిసెంబర్ 7వ తేదీన బుధవారం జరగనుంది. టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య ఇప్పటి వరకు మొత్తం 37 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ 30 మ్యాచ్‌లు గెలవగా, బంగ్లాదేశ్ 6 మ్యాచ్‌లు గెలిచింది. కాగా ఇరు జట్ల మధ్య జరిగిన 1 మ్యాచ్ ఫలితం లేకుండానే ముగిసింది.

భారత్ జట్టు: రోహిత్ శర్మ (c), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్ (wk), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్/అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ సేన్.

బంగ్లాదేశ్ జట్టు: షకీబ్ అల్ హసన్, యాసిర్ అలీ, నజ్ముల్ హుస్సేన్ శాంటో, మహ్మదుల్లా, అఫీఫ్ హొస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్, లిటన్ దాస్, నూరుల్ హసన్, ముస్తాఫిజుర్ రెహమాన్, హసన్ మహమూద్, ఎబాడోత్ హుస్సేన్

Also Read:  Rohit Sharma: రోహిత్‌ ఇక కష్టమే.. తర్వాతి కెప్టెన్ అతడే