India vs New Zealand: టీమిండియాపై న్యూజిలాండ్ ఘన విజయం.!

ఆక్లాండ్ వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్‌పై న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

  • Written By:
  • Updated On - November 25, 2022 / 03:22 PM IST

ఈడెన్ పార్క్ వేదికగా జరిగిన మొదటి వన్డేలో టామ్ లాథమ్ సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ కేన్ విలియమ్సన్ 94 పరుగులతో అదరగొట్టాడు. ఆక్లాండ్ వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్‌పై న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 307 పరుగుల లక్ష్యాన్ని 47.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. న్యూజిలాండ్ ఆటగాళ్లు టామ్ లాథమ్ (145*), కేన్ విలియమ్సన్(94*) పరుగులతో రాణించారు. భారత బౌలర్లు ఉమ్రాన్ మాలిక్ 2, శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్ తీశారు.

టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ తీసుకున్న న్యూజిలాండ్‌ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటింగ్ లో ఓపెనర్లు శిఖర్ ధావన్ (72), శుభ్‌మన్‌ గిల్ (50) పరుగులతో శుభారంభం చేయగా.. శ్రేయాస్ అయ్యర్ 80 పరుగులు చేశాడు. అనంతరం 307 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగ్గిన కివీస్ జట్టు 47.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

ఆరంభంలో నిదానంగా ఆడిన కివీస్ అనంతరం దూకుడు పెంచింది. కివీస్ బ్యాటింగ్ లో కెప్టెన్ కేన్ విలియమ్సన్ (94), టామ్ లాథమ్ (145) పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ ఇద్దరు వరుస పెట్టి బౌండరీలు, సిక్సర్లు బాదుతూ స్కోర్ బోర్డుని పరుగులు పెట్టించారు. లాథమ్ అజేయంగా 104 బంతుల్లో 145 పరుగులతో అదరగొట్టాడు. ఇందులో 19 ఫోర్లు 5 సిక్సర్లు ఉన్నాయి. విలియమ్సన్ 98 బంతుల్లో 94 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో 7 ఫోర్లు, ఓ సిక్సర్ ఉన్నాయి. వీరిద్దరూ కలిసి మరో వికెట్ పడకుండా 221 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దింతో మొదటి వన్డేలో టీమిండియాకు ఓటమి తప్పలేదు. 3 వన్డేల సిరీస్‌ను న్యూజిలాండ్ 1-0 తేడాతో ఆధిక్యాన్ని సాధించింది.