యావత్ క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ఐపీల్ 2024 ఫైనల్ మ్యాచ్ (IPL 2024 Final Match) మరికాసపేట్లో మొదలుకాబోతుంది. చెన్నై వేదికగా SRH, KKR మధ్య ర్ ఫైనల్ పోరు జరగబోతుంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో అనే ఉత్కంఠ నెలకొంది. ఓవైపు 10ఏళ్లుగా మూడో టైటిల్ కోసం ఎదురుచూస్తున్న కోల్‌కతా, మరోవైపు రెండో ఐపీఎల్ ట్రోఫీని నెగ్గాలనే పట్టుదలతో సన్‌రైజర్స్ ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా ఉండడం ఖాయం అనిపిస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ రెండు జట్లలో ఏది టైటిల్ ఫేవరెట్ అని చెప్పడం కష్టమే. ఎందుకంటే ఇరుజట్లు లీగ్ స్టేజ్‌లో అదిరే ప్రదర్శనతోనే ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టాయి. దూకుడుగా ఆడుతూ భారీ స్కోర్లు సాధించడంలో సన్‌రైజర్స్‌కు పేరు ఉంటే, నిలకడ ప్రదర్శనతో ఆల్‌రౌండ్ ఆధిపత్యం చలాయించడంలో కోల్‌కతాకు సాటి లేదు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రీచ్ క్లాసెన్ త్రయం ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తోంది. రాహుల్ త్రిపాఠి, షాహబాజ్ అహ్మద్, నితీశ్ రెడ్డి రాణిస్తే సన్‌రైజర్స్‌కు భారీ స్కోర్ ఖాయం. స్పిన్ బౌలింగ్‌లో సన్‌రైజర్స్ కాస్త వీక్‌గా కనిపించినా క్వాలిఫయర్- 2లో అభిషేక్, షహబాజ్ ఆ సందేహం పోగొట్టారు. ఇక మరోసారి ఆల్‌రౌండ్ ప్రదర్శన చేస్తే హైదరాబాద్‌కు రెండో టైటిల్ నెగ్గడం పెద్ద కష్టమేమీ కాదు.
ఇక ఈ మ్యాచులో గెలిచిన విజేతకు రూ.20 కోట్ల ప్రైజ్ మనీ, రన్నరప్ కు రూ.13 కోట్లు దక్కనున్నాయి. ఇక 3, 4 స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.7 కోట్లు, రూ.6.5 కోట్లు BCCI అందజేయనుంది. దీంతో పాటు ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ విజేతలకు తలో రూ.15 లక్షలు, ‘ఎమర్జింగ్ ఫ్లేయర్ ఆఫ్ ది ఇయర్’కు రూ.20 లక్షలు, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్కు రూ.12 లక్షలు దక్కనున్నాయి. అలాగే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు విజయం సాధించాలని టాలీవుడ్ సెలబ్రిటీస్ వీడియో రూపంలో స్పెషల్ విషెస్ తెలిపారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతూ.. విజయ్ దేవరకొండ, నాగార్జున, వెంకటేష్, విశ్వక్ సేన్, అంజలి, శ్రీనివాస్ రెడ్డి, అల్లరి నరేష్, రాజ్ తరుణ్, సాయి కుమార్ తదితరులు చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
Read Also : Taiwan – China : స్వరం మార్చిన తైవాన్ కొత్త ప్రెసిడెంట్.. చైనాకు స్నేహ హస్తం