Site icon HashtagU Telugu

Love Affair: సన్‌రైజర్స్ హైదరాబాద్ క్రికెటర్‌తో టాలీవుడ్ నటి లవ్ ఎఫైర్..!

Washington Sundar Relation With Anchor Varshini Detailsa

Washington Sundar Relation With Anchor Varshini Detailsa

Love Affair: ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ప్లేఆఫ్స్ రేసు రంజుగా సాగుతోంది. జట్ల మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. దీంతో ఏ జట్టు ప్లేఆఫ్స్‌కు వెళుతుందనేది ఐపీఎల్ ఫ్యాన్స్‌లో ఉత్కంఠ రేపుతోంది. ఈ క్రమంలో క్రికెటర్ల గురించి గాసిప్స్ కూడా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్నాయి. లవ్ ఎఫైర్స్ గురించి వార్తలు బయటకు వస్తున్నాయి. తాజాగా యాంకర్, నటితో ఓ క్రికెటర్ లవ్ లో పడ్డాడనే ప్రచారం సాగుతోంది.

సన్‌రైజన్స్ ప్లేయర్ వాషింగ్టన్ సుందర్.. టాలీవుడ్ నటి, యాంకర్ వర్షిణితో ప్రేమలో పడినట్లు వార్తలొస్తున్నాయి. ఇద్దరు కలిసి బయటకు తెగ తిరుగుతున్నట్లు చెబుతున్నారు. ఈ సీజన్ లో కొన్ని మ్యాచ్ లు మాత్రమే వాషింగ్టన్ సుందర్ ఆడాడు. ఆ తర్వాత గాయం కారణంతో మ్యాచ్ లకు దూరమయ్యాడు. అయితే ఈ ఆటగాడు వర్షిణితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్లు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా ఇద్దరు డేటింగ్ లో ఉన్నారని, బయటకు కలిసి తిరుగుతున్నారని అంటున్నారు.

ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్న క్రమంలో జట్టు రూల్స్ బ్రేక్ చేసి వర్షిణితో వాషింగ్టన్ సుందర్ బయటకు వెళ్లాడట. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం వాషింగ్టన్ సుందర్ పై సీరియస్ అయినట్లు చెబుతున్నారు. దీంతో ఈ వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వర్షిణి ప్రస్తుతం పలు టీవీ షోలలో పాల్గొంటుంది. గతంలో లవర్స్, చందమామ కథలు,. మళ్లీ మొదలైంది, పలు సినిమాల్లో వర్షిణి నటించింది. కానీ వర్షిణి అంతగా పాపులర్ అవ్వలేకపోయింది.

గతంలో ఢీ డ్యాన్స్ షోతో పాటు పలు షోలలో వర్షిణి పాల్గొని బుల్లితెర ప్రేక్షకుల్లో పాపులర్ అయింది. ప్రస్తుతం అప్పుడప్పుు పలు టీవీ షోలలో కనిపిస్తుంది. ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ తో ప్రేమ వ్యవహారం నడపుతుందనే వార్తలతో మళ్లీ ఆమె గురించి చర్చ జరుగుతోంది.