Yuzvendra Chahal: పర్పుల్ క్యాప్ కంటే ఐపీఎల్ ను గెలవడమే ముఖ్యం : యుజ్వేంద్ర చాహల్

రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య కీలక మ్యాచ్ మంగళవారం రాత్రి మొదలైంది.టాస్ గెలిచిన గుజరాత్ టీమ్ తొలుత బౌలింగ్ తీసుకుంది.

  • Written By:
  • Publish Date - May 24, 2022 / 10:38 PM IST

రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య కీలక మ్యాచ్ మంగళవారం రాత్రి మొదలైంది.టాస్ గెలిచిన గుజరాత్ టీమ్ తొలుత బౌలింగ్ తీసుకుంది. ఈసందర్భంగా రాజస్థాన్ రాయల్స్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ముఖ్యమైన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసే బౌలర్లకు ఏటా పర్పుల్ క్యాప్ ఇస్తుంటారు.

ఈసారి దాని రేసులో యుజ్వేంద్ర చాహల్ నంబర్1 స్థానంలో ఉన్నాడు. దీనికి సంబంధించి మీడియా అతడిని ప్రశ్నించగా..”నేను పర్పుల్ క్యాప్ లక్ష్యంగా ఆడను. మా టీమ్ రాజస్థాన్ రాయల్స్ గెలుపే ఏకైక లక్ష్యం. ఐపీఎల్ కప్ ను మా జట్టు సాధించి తీరాలి. అందుకోసం నా వంతుగా కృషి చేస్తా” అని చాహల్ వ్యాఖ్యానించాడు. ఈ ఐపీఎల్ లో ఇప్పటివరకు 56 ఓవర్లు బౌలింగ్ చేసిన చాహల్ 26 వికెట్లు తీశాడు. అతడి తర్వాతి స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ వనీండు హసరంగ ( 24 వికెట్లు) ఉన్నారు.

గుజరాత్ టైటాన్ కు చెందిన రషీద్ ఖాన్ కూడా పర్పుల్ క్యాప్ రేసులో ఉన్నారు. ఖాన్ కేవలం 14 మ్యాచ్ లలో 18 వికెట్లు తీశారు. ఈరోజు గుజరాత్ టైటాన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఒక్క వికెట్ తీసినా ఒక ఐపీఎల్ సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా చాహల్ రికార్డు సృష్టిస్తారు. గతంలో ఈ రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ ఇమ్రాన్ తాహిర్ పేరిట ఉంది.