IPL Finals GT vs RR:మెగా ఫైనల్లో గుజరాత్ తుది జట్టు ఇదే

ఐపీఎల్ 15వ సీజన్ చివరి అంకానికి చేరుకుంది. టైటిల్ గెలుచుకునే జట్టేదో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.

  • Written By:
  • Publish Date - May 28, 2022 / 04:34 PM IST

ఐపీఎల్ 15వ సీజన్ చివరి అంకానికి చేరుకుంది. టైటిల్ గెలుచుకునే జట్టేదో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. ఆదివారం అహ్మదాబాద్ స్టేడియం వేదికగా జరగనున్న మెగా ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ , రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈ సీజన్ తో ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ అదిరిపోయే ప్రదర్శనతో ఫైనల్ కు చేరింది. కొత్త జట్టు ఎలా ఆడుతుందో అన్న అనుమానాలకు తెర దించుతూ వరుస విజయాలతో ఆకట్టుకుంది. లీగ్ స్టేజ్ ను టాప్ ప్లస్ తో ముగించి…తొలి క్వాలిఫైయర్ లో రాజస్థాన్ ను చిత్తు చేసింది. ఇప్పుడు టైటిల్ కు అడుగు దూరంలో నిలిచిన గుజరాత్ తుది జట్టు కూర్పు ఎలా ఉండబోతోందో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

జట్టులో ఎక్కవ మంది మ్యాచ్ విన్నర్లు ఉండడం గుజరాత్ కు అడ్వాంటేజ్. అయితే తొలి క్వాలిఫైయర్ లో ఆడిన జట్టుతోనే గుజరాత్ బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుంది. ఓపెనర్లుగా వృద్దిమాన్ సాహా, శుబ్ మన్ గిల్ రానుండగా.. వన్ డౌన్ లో వేడ్ ఆడనున్నాడు. నాలుగో స్థానంలో కెప్టెన్ హార్దిక పాండ్య , అయిదో స్థానంలో డేవిడ్ మిల్లర్ కీలకం కానున్నారు. తర్వాత రాహుల్ తెవటియా , రషీద్ ఖాన్ చోటు దక్కించికోనున్నారు. స్పిన్ విభాగంలో రషీద్ ఖాన్ , పేస్ విభాగంలో మొహమ్మద్ షమీ, అల్జెరీ జోసెఫ్ , యశ్ దయాల్ కీలకమని చెప్పొచ్చు.

తొలి క్వాలిఫైయర్ లో సాహా నిరాశ పరిచినా…వేడ్ , గిల్ రాణించారు. అటు పాండ్య , మిల్లర్ కూడా అదరగొట్టారు. ఈ సీజన్ లో జట్టును సమర్థవంతంగా లీడ్ చేయడమే కాకుండా…వ్యక్తిగతంగానూ రాణిస్తున్న పాండ్య ఫైనల్లో కూడా చెలరేగితే గుజరాత్ టైటాన్స్ కు టైటిల్ అందినట్టే. ఇక మిల్లర్ కూడా మెరుపు ఇన్నింగ్స్ లతో సత్తా చాటుకున్నాడు. ఈ నేపథ్యంలో గత మ్యాచ్ పెర్ఫార్మెన్స్ రిపీట్ చేస్తే తొలి సీజన్ లోనే గుజరాత్ కప్ అందుకోవడం ఖాయమని అంచనా వేస్తున్నారు.