Tim Southee: వన్డే ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5 నుండి ప్రారంభం కానుంది. అంతకంటే ముందు న్యూజిలాండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఆ జట్టు అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ (Tim Southee) కుడి బొటన వేలికి గాయమైంది. ఇప్పుడు ఈ గాయం నుంచి కోలుకోవాలంటే సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో టిమ్ సౌథీ ప్రపంచకప్‌లో ఆడడం సందేహంగా మారింది.
నాలుగో వన్డేలో జో రూట్‌కి క్యాచ్ తీసుకునే ప్రయత్నంలో టిమ్ సౌథీ గాయపడ్డాడు. దీని తర్వాత సౌథీ మైదానం నుంచి వెళ్లిపోయాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత సౌదీ బొటనవేలును స్కాన్ చేయగా, అది ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. ఇప్పుడు దాన్ని సరిచేయాలంటే సర్జరీ చేయాల్సి ఉంటుందని డాక్టర్లు చెప్పినట్టు సమాచారం.
Also Read: T20 World Cup: 2024 టీ20 ప్రపంచ కప్ లో భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరిగేది ఇక్కడే..!?
టిమ్ సౌథీకి శస్త్రచికిత్స గురించి సమాచారం ఇస్తూ న్యూజిలాండ్ జట్టు కోచ్ గ్యారీ స్టెడ్ అతని శస్త్రచికిత్స సవ్యంగా జరగాలని మేమంతా ఆశిస్తున్నామన్నారు. సౌథీ కుడి బొటనవేలులో కొన్ని పిన్‌లు, స్క్రూలు చొప్పించబడతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ బాధను తట్టుకోగలడో లేదో చూడాలి. ఎందుకంటే సౌథీ మళ్లీ తిరిగి వస్తే ఎటువంటి సమస్య సౌథీకి ఎదురుకాకూడదు. ప్రపంచకప్‌లో మా మొదటి మ్యాచ్ అక్టోబర్ 5న ఇంగ్లాండ్‌తో జరగనుంది. అప్పటికి అతను పూర్తిగా ఫిట్‌గా ఉంటాడని మేము ఆశిస్తున్నామని పేర్కొన్నాడు.
వన్డే సిరీస్ ఆడేందుకు కివీస్ జట్టు బంగ్లాదేశ్ చేరుకుంది
ప్రపంచ కప్‌లో పాల్గొనడానికి ముందు న్యూజిలాండ్ జట్టు ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉంది. అక్కడ సెప్టెంబర్ 21 నుండి ఆతిథ్య జట్టుతో 3 మ్యాచ్‌ల ODI సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో ప్రపంచ కప్‌కు ప్రకటించిన జట్టులోని 5 మంది సభ్యులు ఆడనున్నారు. ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు కివీస్ జట్టు కూడా రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఒకటి సెప్టెంబర్ 29న పాకిస్తాన్‌తో, మరొకటి అక్టోబర్ 2న దక్షిణాఫ్రికాతో ఆడనుంది.