Site icon HashtagU Telugu

Tilak Varma : హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మ ఇంట్లో ముంబై టీం స్పెషల్ డిన్నర్.. సచిన్ కూడా వచ్చాడుగా..

Tilak Varma host special Dinner to Mumbai Indians Team in his house at Hyderabad

Tilak Varma host special Dinner to Mumbai Indians Team in his house at Hyderabad

ఈ సంవత్సరం IPL రసవత్తరంగా సాగుతోంది. ప్రతి మ్యాచ్ చివరివరకు ఉత్కంఠగా సాగుతుండటంతో ప్రేక్షకులు, క్రికెట్(Cricket) అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. నేడు ముంబై ఇండియన్స్(Mumbai Indians) టీం, హైదరాబాద్(Hyderabad) టీంతో హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ కోసం ముంబై టీం హైదరాబాద్ కు ఒక రోజు ముందే చేరుకుంది. IPL లో మన హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ(Tilak Varma) ముంబై ఇండియన్స్ టీం తరపున ఆడుతున్నాడు.

దీంతో హైదరాబాద్ లో మ్యాచ్ ఉండటంతో తన టీం అందర్నీ తన ఇంట్లో డిన్నర్ కి ఆహ్వానించాడు తిలక్ వర్మ. దీనికి ముంబై టీం అంతా కూడా ఓకే అని తిలక్ వర్మ ఇంటికి డిన్నర్ కి వచ్చారు. సచిన్, రోహిత్, సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్.. సహా ఆటగాళ్లు అంతా హైదరాబాద్ గల్లీల్లో ఉన్న తిలక్ వర్మ ఇంటికి విచ్చేశారు. పలువురు టీం సపోర్టింగ్ స్టాఫ్ కూడా వచ్చారు. సచిన్, రోహిత్.. ఇలా టీంలో ఉన్న పెద్ద ఆటగాళ్లు సైతం ఓ యువ క్రికెటర్ ఇంటికి రావడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.

తిలక్ వర్మ, అతని ఫ్యామిలీ ముంబై ఇండియన్స్ టీంతో కలిసి దిగిన ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. ముంబై ఇండియన్స్ టీంకు ఆతిథ్యం ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నాను. నేను, నా ఫ్యామిలీ ఈ రోజుని మర్చిపోలేము. డిన్నర్ కి వచ్చినందుకు అందరికి ధన్యవాదాలు అని పోస్ట్ చేశాడు. దీంతో తిలక్ ఫ్యామిలీ ముంబై ఇండియన్స్ టీంతో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక సచిన్, రోహిత్.. పలువురు ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు తిలక్ వర్మ ఇంటికి వచ్చారని తెలియడంతో చుట్టుపక్కల జనాలు వారితో ఫోటోల కోసం తిలక్ ఇంటి బయట ఎదురుచూశారు.

 

Also Read :   Anushka Sharma: ధోనీపై అనుష్క శర్మ కామెంట్స్.. మేము కూడా ఆయన ఫ్యాన్సే అంటున్న కోహ్లీ భార్య..!