IND vs AUS 2nd ODI: రెండో వన్డేలో తిలక్ వర్మ?

ప్రపంచ కప్ కు ముందు టీమిండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతుంది. శుక్రవారం మొదటి వన్డేలో ఆసీస్ పై భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

IND vs AUS 2nd ODI: ప్రపంచ కప్ కు ముందు టీమిండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతుంది. శుక్రవారం మొదటి వన్డేలో ఆసీస్ పై భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన లక్ష్యాన్ని మరో 8 బంతులు ఉండగానే ఛేదించింది. రెండో వన్డే ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరగనుంది.కాగా ఈ సన్నాహక మ్యాచ్ లో భారత జట్టులో స్వల్ప మార్పులు జరగనున్నాయి. మూడో వన్డే సమయానికి రోహిత్, విరాట్, కుల్దీప్, హార్దిక్ తిరిగి జట్టులో చేరనున్నారు. దీంతో ఏమైనా ప్రయోగాలు చేయాలన్నా, కొత్త వారికి అవకాశం ఇవ్వాలన్నా రెండో వన్డేలోనే ఛాన్స్ ఉంది. కాబట్టి రెండో వన్డేలో ఇషాన్ కిషన్‌ను డగౌట్ లో కూర్చోబెట్టి తిలక్ వర్మకు అవకాశం ఇవ్వాలని హెడ్ కోచ్ ద్రావిడ్ అనుకుంటున్నాడట.

ప్రస్తుతం కేఎల్ రాహుల్ ఎలాగో కీపర్ గా కొనసాగుతున్నాడు. ఇషాన్ కిషన్ మిడిలార్డర్లో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తిలక్ వర్మకు చోటు కల్పించి మిడిల్ అర్దర్లో ఆడిస్తే తిలక్ కు ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది కదా అని సెలెక్టర్లు భావిస్తున్నారు. ఇక స్పీడస్టర్ మహమ్మద్ సిరాజ్‌కు రెండో వన్డేలో కూడా రెస్ట్ ఇచ్చే అవకాశముంది. తొలి వన్డేలో బ్యాటుతో విఫలమై, ఫీల్డింగ్‌లోనూ తేలిపోయిన శ్రేయాస్ అయ్యర్‌కు ఇదే చివరి అవకాశం అంటున్నారు క్రికెట్ అనలిస్టులు. ఏడాదిన్నర తర్వాత జట్టులోకి వచ్చిన అశ్విన్ మిగతా రెండు వన్డేల్లో రాణిస్తే వన్డే ప్రపంచ కప్ లో అవకాశం దక్కుతుంది. మొదటి వన్డేలో తేలిపోయిన శార్దూల్ ఠాకూర్‌ మిగతా రెండు వన్డేల్లో రాణించకపోతే వరల్డ్ కప్‌లో అతని స్థానాన్ని అశ్విన్ ఆక్రమించే ఛాన్స్ లేకపోలేదు. మరోవైపు హోల్కర్ స్టేడియంలో జరగనున్న రెండో మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందంటున్నారు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

Also Read: CBN Arrest Effect : BRS పార్టీలో చీలిక‌?, `పోచారం` రియాక్ష‌న్ తో అప్ర‌మ‌త్తం!