Site icon HashtagU Telugu

Ind Beat SA: తిలక్ వర్మ సెంచరీ.. 11 ప‌రుగుల తేడాతో భార‌త్ ఘ‌న‌విజ‌యం

IND vs SA

IND vs SA

సెంచూరియన్ (దక్షిణాఫ్రికా): భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య నాలుగు టీ20ల సిరీస్‌లో భాగంగా బుధ‌వారం రాత్రి మూడో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. 220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 208 పరుగులు మాత్రమే చేయగలిగింది. దక్షిణాఫ్రికా తరఫున క్లాసెన్ 41 పరుగులు, మార్కో జాన్సెన్ 54 పరుగులు చేశారు. అంతకుముందు మూడో టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో టీమిండియా 220 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

భారత్ తరఫున తిలక్ వర్మ 107 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతడికి తోడు అభిషేక్ శర్మ అద్భుత అర్ధశతకం సాధించాడు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. టీమ్ ఇండియా తరఫున టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో తొలి సెంచరీని నమోదు చేశాడు తిల‌క్ వ‌ర్మ‌. సౌతాఫ్రికా బౌలర్లలో అండిలే సిమ్లానే, కేశవ్ మహరాజ్ చెరో రెండు వికెట్లు తీశారు.

Also Read: AP Deputy Speaker : ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామకృష్ణరాజు ఏకగ్రీవ ఎన్నిక

ముందుగా టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ ఆడెన్ మార్క్రామ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. సంజూ శాంసన్, అభిషేక్ శర్మతో భారత ఇన్నింగ్స్ ప్రారంభమైంది. తొలి ఓవర్‌లోనే మార్కో జాన్సెన్ సంజూ శాంసన్ (0)ను అవుట్ చేశాడు. కానీ 3వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన తిలక్ వర్మ ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ భారీ సిక్సర్లు బాదడం మొదలుపెట్టాడు. మరో ఎండ్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ (50: 25 బంతుల్లో 3×4, 5×6) కూడా సమర్థంగా నిలబడ్డాడు. వీరిద్దరి దూకుడు కారణంగా స్కోరు బోర్డు వేగంగా పెరిగింది.

తిలక్ వర్మ, అభిషేక్ శర్మలు రెండో వికెట్‌కు 8.2 ఓవర్లలో 107 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 107 పరుగుల వద్ద అభిషేక్ అవుట్ కాగా, ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (1), హార్దిక్ పాండ్యా (18), రింకూ సింగ్ (8) చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. అయినా, తిలక్ వర్మ అదే దూకుడు కొనసాగిస్తూ భారత స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.