Site icon HashtagU Telugu

Tilak Varma: తిలక్ వర్మ అరుదైన రికార్డ్.. చిన్న వయసులో హాఫ్ సెంచరీ

Tilak Varma

New Web Story Copy 2023 08 07t095527.497

Tilak Varma: ఐపీఎల్ లో సత్తా చాటిన తిలక్ వర్మ.వెస్టిండీస్ టూర్‌లో తెలుగోడి పవర్ రుచి చూపిస్తున్నాడు. వెస్టిండీస్ తో జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్ సిరీస్ లో చోటు దక్కించుకున్న వర్మ, అరంగేట్ర మ్యాచులోనే అదరగొట్టాడు. మొదటి టీ20 మ్యాచ్ లో 22 బంతుల్లో 39 విలువైన పరుగులు చేసి క్రికెట్ దిగ్గజాలతో శభాష్ అనిపించుకున్నాడు. అయితే రెండో మ్యాచ్ లోనూ అదే ఆట కొనసాగించాడు. కష్ట సాధ్యమైన పిచ్ పై ఎంతో పరిణతి చూపిస్తూ బ్యాటింగ్ చేశాడు. హర్దిక్‌ పాండ్యా, సూర్యకుమార్‌ యాదవ్‌, శుబ్‌మన్‌ గిల్‌ లాంటి వాళ్లు విఫలమైన చోట.. ఒత్తిడి ఏం మాత్రం లేకుండా చూడ చక్కటి షాట్లతో వెస్టిండీస్‌ బౌలర్లపై ఆధిపత్యం చూపించాడు. వరుసపెట్టి సీనియర్లందరూ చేతులెత్తుస్తున్నా, తాను మాత్రం అదరలేదు, బెదరలేదు. విండీస్ విధ్వంసకర బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. ఓ దశలో జట్టు బాధ్యతను 20 ఏళ్ల తిలక్ వర్మ తీసుకున్నాడు.గుడ్డిగా షాట్స్ ఆడకుండా.. పరిస్థితులకు తగ్గట్లు బ్యాట్ ఝళిపించాడు. ఫలితంగా 41 బంతుల్లో 51 పరుగులు చేసి తన కెరీర్ లో తొలి అర్ధ సెంచరీ నమోదు చేసి చరిత్ర సృష్టించాడు.

టీ20 ఫార్మాట్‌లో చిన్న వయసులో హాఫ్ సెంచరీ చేసిన రెండో భారతీయ ఆటగాడిగా తిలక్ వర్మ రికార్డ్ తిరగరాశాడు. తిలక్ వర్మ మొదటి హాఫ్ సెంచరీ సమయానికి తన వయసు 20 సంవత్సరాల 271 రోజులు. ఇదే రికార్డును రోహిత్ శర్మ 20 ఏళ్ల 143 రోజుల వయసులో సాధించాడు. రిషభ్ పంత్ 21 ఏళ్ల 38 రోజులు, రాబిన్ ఉతప్ప 21 ఏళ్ల 307 రోజులు, సురేశ్ రైనా 22 ఏళ్ల 90 రోజులలో తమ మొదటి టీ20 హాఫ్ సెంచరీ కొట్టారు.

Also Read: Terrorist Killed: మరో ఉగ్రవాదిని హతమార్చిన భద్రతా బలగాలు.. 24 గంటల్లో రెండో చొరబాటు యత్నం..!