Site icon HashtagU Telugu

Abu Dhabi T10: అబుదాబీ టీ 10 లీగ్ కు కౌంట్ డౌన్..!

953219 Abu Dhabi T10 League

953219 Abu Dhabi T10 League

క్రికెట్ నయా ఫార్మాట్ టీ10 లీగ్ అభిమానులను అలరించేందుకు మళ్ళీ వచ్చేసింది. ప్రపంచ వ్యాప్తంగా పలువురు స్టార్ క్రికెటర్లు ఆడుతున్న అబుదాబీ టీ10 లీగ్ ఆరో సీజన్ నవంబర్ 23 నుంచి ఆరంభం కానుంది. 12 రోజుల పాటు జరగనున్న ఈ లీగ్ కు సంబంధించిన టిక్కెట్ల అమ్మకాలు మొదలయ్యాయి. టీ ట్వంటీ ఫార్మేట్ లో స్టార్ ప్లేయర్స్ గా ఉన్న కిరణ్ పొల్లార్డ్ , బ్రేవో, షకీబుల్ హసన్, నికోలస్ పూరన్, ఆండ్రూ రస్సెల్ , టిమ్ డేవిడ్ , డేవిడ్ మిల్లర్, బ్రత్ వెయిట్ , సికిందర్ రాజా, మోర్గాన్ , హసరంగా టీ10 లీగ్ లో అభిమానులను అలరించనున్నారు.

అలాగే భారత మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, హర్భజన్ సింగ్, శ్రీశాంత్, అభిమన్యు మిథున్ కూడా టీ10 లీగ్ లో సందడి చేయనున్నారు. రైనా డెక్కన్ గ్లాడియేటర్స్ కూ, భజ్జీ ఢిల్లీ బుల్స్ కూ, శ్రీశాంత్ బంగ్లా టైగర్స్ కూ, అభిమన్యు మిథున్ నార్తర్న్ వారియర్స్ కూడా ప్రాతినిథ్యం వహించనున్నారు. కాగా అబుదాబీ స్టేడియం వేదికగా జరగనున్న ఆరంభ మ్యాచ్ లో కిరణ్ పొల్లార్డ్ సారథ్యంలోని న్యూయార్క్ స్ట్రైకర్స్ , షకీబుల్ కెప్టెన్సీలోని బంగ్లా టైగర్స్ తలపడనున్నాయి. తొలి సీజన్ నుంచే ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను విశేషంగా ఆకట్టుకున్న టీ10 లీగ్ కు ప్రతీ ఏడాదీ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. ఇటు బ్రాండ్ వాల్యూలోనూ, అటు వ్యూయర్ షిప్ లోనూ సరికొత్త రికార్డులు నమోదు చేసింది. దీంతో మరోసారి టీ10 లీగ్ ఫ్యాన్స్ ను ఫుల్ ఎంటర్ టైన్ చేస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు.