MS Dhoni: ఇదే నా చివరి ఐపీఎల్: ధోని సంచలన వ్యాఖ్యలు!

ఎంఎస్ ధోని (MS Dhoni) ఐపీఎల్ 2023 సీజన్ లో నూ అదరగొడుతున్నాడు. తన ఎత్తులు, పై ఎత్తులతో ప్రత్యర్థి జట్టును చిత్తు చేస్తున్నాడు.

  • Written By:
  • Updated On - April 22, 2023 / 12:10 PM IST

ఎంఎస్ ధోని (MS Dhoni) ఐపీఎల్ 2023 సీజన్ లో నూ అదరగొడుతున్నాడు. తన ఎత్తులు, పై ఎత్తులతో ప్రత్యర్థి జట్టును చిత్తు చేస్తున్నాడు. తాజాగా ఈ స్టార్ (MS Dhoni) క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. త‌న వ‌య‌సు పెరిగింద‌ని ఈ విష‌యం చెప్ప‌డానికి తాను ఏ మాత్రం సిగ్గుప‌డ‌న‌ని అన్నాడు క్రికెట‌ర్ ధోని. తన కెరీర్ చివరి దశకు చేరుకున్నట్టేనని స్పష్టం చేశాడు. సచిన్ టెండూల్కర్ (Sachin) మాదిరి 16 ఏళ్లకే కెరీర్ ను ప్రారంభిస్తే ఆటను ఎంతో ఆస్వాదించవచ్చని చెప్పాడు. తాను కెరీర్ చివరి దశలో ఉన్నాననే విషయం తనకు బాగా తెలుసని ధోనీ అన్నాడు.

అందుకే ఈ ఐపీఎల్ (IPL) సీజన్ లో ప్రతి మ్యాచ్ ను పూర్తి స్థాయిలో ఆస్వాదించేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పాడు. తనకు చెన్నై సూపర్ కింగ్స్ తో విడదీయలేని అనుబంధం ఉందని అన్నారు. సీఎస్కే అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమ, అభిమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. ఈ సీజన్ లో తనకు ఎక్కువగా బ్యాటింగ్ (Batting) చేసే అవకాశం రాలేదని అన్నాడు. భారత జట్టుకు ధోనీ దూరమైనప్పటికీ… ఇప్పటికీ ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం చెక్కు చెదరలేదు. ఇదే చివరి ఐపీఎల్ కావచ్చునని, ప్రతి ఆటను ఆస్వాదిస్తున్నానని (MS Dhoni) అన్నారు.

కాగా ఐపీఎల్ 2023(IPL 2023) సీజన్ లో ధోని (MS Dhoni) సరికొత్తగా కన్పిస్తున్నాడు. మ్యాచ్ మ్యాచుకీ తనలోని పాత ధోనిని బయటపెడుతున్నాడు. ప్రస్తుత ఐపీఎల్​ సీజన్​లో తన బ్యాటింగ్ తో ఆకట్టుకుంటున్నాడు. లేటెస్ట్ గా తన వికెట్ కీపింగ్ స్కిల్స్ తో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. లేటెస్ట్ గా హైదరాబాద్ తో జరిగిన మ్యాచులో తన మ్యాజిక్ ఏంటో చూపించాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో ధోని తన పేరిట ఐపిఎల్‌లో అరుదైన రికార్డును సృష్టించాడు. ఐపీఎల్‌ చరిత్రలో వికెట్‌ కీపింగ్‌ చేస్తూ 200 మంది ఆటగాళ్లను ఔట్‌ చేసిన తొలి వికెట్ కీపర్ ధోనీ నిలిచాడు. ఇందులో క్యాచ్‌లు, స్టంపింగ్‌లు, రనౌట్‌లు ఉన్నాయి.

Also Read: Job Notification: గురుకులాల్లో 1,276 పీజీటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్