నాగ్‌పూర్‌లో భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి వన్డే మ్యాచ్ (India vs England 1st ODI) జరిగింది. ఇంగ్లాండ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ బాగానే ఆరంభించింది. ఆ తర్వాత ఇంగ్లీష్ జట్టు రనౌట్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్లు బెన్ డకెట్ మరియు ఫిల్ సాల్ట్ ఇద్దరూ మొదటి వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కానీ చిన్న తప్పిదం కారణంగా ఫిల్ సాల్ట్ తన వికెట్ కోల్పోయాడు. ఇదే మ్యాచ్ టర్న్ తీసుకుంది. ఈ వికెట్ తీయడంలో శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer)అద్భుత త్రో విసిరి టీమిండియాకు తొలి వికెట్ సాధించి పెట్టాడు.
AP Ministers Ranks : ఏపీ మంత్రులకు ర్యాంకులు.. చంద్రబాబు, పవన్, లోకేశ్‌కు ఎంతంటే..?
హార్దిక్ పాండ్యా వేసిన 9వ ఓవర్లో ఇంగ్లాండ్ జట్టుకు తొలి దెబ్బ పడింది. ఈ ఓవర్ ఐదవ బంతికి ఫిల్ సాల్ట్ పాయింట్ వైపు షాట్ ఆడాడు. బంతి బౌండరీ వైపు వెళ్తుండగా సాల్ట్, బెన్ డకెట్ రెండు పరుగులు చేశారు. కానీ సాల్ట్ మూడవ పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే నాన్-స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న డకెట్ కొన్ని అడుగులు ముందుకు వేసి, మూడో పరుగుకు నిరాకరించాడు. కానీ ఫిల్ సాల్ట్ పిచ్ సగం వరకు వచ్చాడు. ఈ సమయంలో శ్రేయాస్ అయ్యర్ బంతిని ఛేజ్ చేసి బౌండరీ నుండి వేగంగా విసిరాడు. వికెట్ కీపర్ ఎల్ రాహుల్ బంతిని ఒడిసిపట్టుకుని స్టంపౌట్ చేశాడు. దీంతో 75 పరుగుల వద్ద ఇంగ్లాండ్ తొలి వికెట్ కోల్పోయింది. మంచి ఫామ్‌లో ఉన్న ఫిల్ సాల్ట్ చిన్న తప్పిదానికి వికెట్ కోల్పోవాల్సి వచ్చింది.
ఫిల్ సాల్ట్ ఇప్పటికే ఇంగ్లాండ్ తరపున వన్డేల్లో అరంగేట్రం చేశాడు. తన వన్డే కెరీర్‌లో 25 ఇన్నింగ్స్‌లలో 866 పరుగులు చేశాడు. అయితే అతను టీం ఇండియాతో ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే ఈ రోజు భారత్‌తో జరిగిన తన తొలి వన్డే మ్యాచ్‌లో సాల్ట్ అద్భుతంగా రాణించాడు. 26 బంతుల్లో 43 పరుగులు చేసి ఇంగ్లాండ్‌కు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు.