Site icon HashtagU Telugu

IPL: ఈ సారి ఐపీఎల్‌ విన్నర్ ఎవరో చెప్పేసిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్.. కప్ ఆ జట్టుకేనా..?

Rajasthan Royals

Rajasthan Royals

IPL: నేటి నుంచి ఐపీఎల్ టోర్నీ ప్రారంభం కానుంది. కరోనా కారణంగా గతంలో యూఏఈ వేదికగా మ్యాచ్‌లు జరగ్గా.. గత ఏడాది కరోనా ప్రభావం తగ్గడంతో ఇండియాలోనే జరిగాయి. ఈ సారి కూడా ఇండియాలోనే ఐపీఎల్ జరుగుతోంది. ఇండియాలోనే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా అత్యంత క్రేజ్, పాపులర్ అయిన టీ20 టోర్నీ ఐపీఎల్ అని ఎవరిని అడిగినా చెబుతారు. విదేశీ ప్లేయర్లు కూడా ఈ టోర్నీలో ఆడేందుకు ఆసక్తి కనబరుస్తూ ఉంటారు.

నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్.. రెండు నెలల పాటు జరగనుంది. రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను వినోదాన్ని ఆనందించనుంది. ఐపీఎల్ ప్రారంభం కావడంతో విన్నర్ గా ఈ సీజన్‌లో ఎవరు నిలుస్తారనేది హాట్‌టాపిక్‌గా మారింది. గత ఏడాది కొత్తగా వచ్చిన హార్డిక్ పాండ్యా ఆధ్వర్యంలోని గుజరాత్ టైటాన్స్ జట్టు కప్ గెలుచుకుంది. ప్రాంచైజీ స్టార్ట్ చేసిన ఆరంభంలోనే ఆ జట్టు బోణీ కొట్టింది.

ఈ క్రమంలో ఈ సారి ఏ జట్టుకు అవకాశాలు ఉన్నాయనే దానిపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది కప్ చేజార్చుకున్న రాజస్థాన్ రాయల్స్.. ఈ సారి టైటిల్ గెలుస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ఐపీఎల్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నానని, ఈ ఏడాది కప్ కొట్టేది రాజస్థాన్ రాయల్స్‌నేనంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గత ఏడాది రన్నరప్ గా రాజస్థాన్ రాయల్స్ నిలిచింది. ఫైనల్ పోరులో గుజరాత్ టైటాన్స్ పై ఓటమి పాలైంది. ఒక్క అడుగు దూరంలో ఐపీఎల్ కప్ ను చేజార్చుకుంది. దీంతో ఈ సారైనా రాజస్థాన్ రాయల్స్ కప్ గెలుచుకోవాలని ఆ జట్టు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ఈ క్రమంలో మైకెల్ వాన్ చేసిన వ్యాఖ్యలు ఆ జట్టు ఆటగాళ్లు, ఫ్యాన్స్‌కు బలాన్ని ఇస్తున్నాయి.