Site icon HashtagU Telugu

Preity Zinta: ఈ సారి ఐపీఎల్ టైటిల్ నాదేనంటున్న ప్రీతీ పాప

Preity Zinta

Preity Zinta

గత 17 ఏళ్లుగా తొలి ట్రోఫీ కోసం ఎదురుచూస్తున్న పంజాబ్ కింగ్స్ వచ్చే సీజన్లో ఆ జట్టు కల నెరవేరేలా కనిపిస్తుంది. ఈసారి పంజాబ్ బలమైన జట్టుని బరిలోకి దింపబోతుంది. మెగావేలంలో ఆచితూచి మ్యాచ్ విన్నర్లని కొనుగోలు చేసిన ప్రీతిజింతా ఇప్పుడు జట్టును ఛాంపియన్‌ చేసేందుకు సరికొత్త ప్రణాళికలు రచిస్తుంది.

మెగా వేలానికి ముందు పంజాబ్ కింగ్స్ రికీ పాంటింగ్‌ను ప్రధాన కోచ్‌గా నియమించింది. ఆస్ట్రేలియాకు రెండు వన్డే ప్రపంచకప్ లు అందించిన రికీ పాంటింగ్ లాంటి కోచ్ ఉండటం పంజాబ్ కు అదనపు బలంగా మారింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ను చూడండి. ఆ జట్టు 7 సంవత్సరాల తర్వాత 2019లో మొదటిసారి ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. అది పాంటింగ్ తోనే సాధ్యపడింది. మెగా వేలంలో శ్రేయాస్ అయ్యర్‌ను కొనుగోలు చేసి ఫ్రాంచైజీ జట్టును పటిష్టం చేసింది. అంతేకాదు వచ్చే సీజన్లో పంజాబ్ కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్ ని అపాయింట్ చేసేందుకు పంజాబ్ యాజమాన్యం సిద్ధంగా ఉంది. అయ్యర్, పాంటింగ్ కలిస్తే పంజాబ్ కి తిరుగుండదు. వీళ్ళిద్దరితో పాటు ఏ ఓవర్‌లోనైనా మ్యాచ్‌ని మలుపు తిప్పగల ముగ్గురు స్టార్ ఆల్ రౌండర్లను కొనుగోలు చేసింది.

మార్కో యాన్సెన్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్‌ నెక్స్ట్ సీజన్లో పంజాబ్ కు ప్రాతినిధ్యం వహిస్తారు. గత సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున స్టోయినిస్ కీలక పాత్ర పోషించగా, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఫైనల్స్‌కు తీసుకెళ్లడంలో మార్కో జాన్సెన్ కీలక పాత్ర పోషించాడు. అయితే గత సీజన్లో మాక్స్ వెల్ ఆర్సీబీ తరుపున ఆశించిన స్థాయిలో రాణించలేదు. కానీ తన ప్రతిభను ఏ మాత్రం తక్కువ అంచనా వేయకూడదు. మాక్స్ వెల్ ను తక్కువ అంచనా వేసి ప్రమాదంలో పడేందుకు ఏ జట్టు కూడా సిద్ధంగా ఉండదు. సో వచ్చే సీజన్లో మ్యాక్సీ కచ్చితంగా పంజాబ్ కు ఖరీదైన ప్లేయర్ గా మారతాడనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.