T20 World Cup 2024: ఓపెన‌ర్‌గా విరాట్ కోహ్లీ.. ఐర్లాండ్‌తో త‌ల‌ప‌డే టీమిండియా జ‌ట్టు ఇదేనా..?

  • Written By:
  • Publish Date - May 31, 2024 / 08:10 AM IST

T20 World Cup 2024: న్యూయార్క్‌కు చేరుకున్న భారత జట్టు టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup 2024)కు సన్నద్ధమవుతోంది. జూన్ 1న బంగ్లాదేశ్‌తో టీమిండియా తన ఏకైక వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఆ త‌ర్వాత జూన్ 5న ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో ప్లేయింగ్ ఎలెవన్ స్పష్టంగా క‌నిపిస్తోందని కొన్ని నివేదిక‌లు వెలువ‌డ్డాయి. ప్రపంచకప్‌లో భారత జట్టు ఓపెనింగ్ జోడీ ఎలా ఉంటుంది? తొలి మ్యాచ్‌లో ప్లేయింగ్ ఎలెవెన్ ఎలా ఉండ‌నుంది అనే దానిపై చాలా ఊహాగానాలు ఉన్నాయి. టీమ్ ఇండియాలో పర్ఫెక్ట్ ప్లేయింగ్ ఎలెవెన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

విరాట్ కోహ్లి ఓపెనింగ్ చేయగలడు

టీమిండియా ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్‌కు బదులు విరాట్ కోహ్లీనే బరిలోకి దిగవచ్చని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. కోహ్లీ.. రోహిత్ శర్మతో ఓపెనింగ్ పెయిర్‌లో ఉండే అవ‌కాశం ఉంది. కుడి-ఎడమ కలయికను కొనసాగించే బదులు టీమ్ ఇండియా అనుభవంపై ఆధార‌ప‌డ‌నుంది. తొలి మ్యాచ్‌ల్లో జైస్వాల్‌కు చోటు దక్కడం కష్టమేన‌ని కూడా అర్థ‌మ‌వుతోంది. ఆ తర్వాత జ‌రిగే మ్యాచ్‌లు అంటే USA లేదా కెనడా వంటి జట్టుపై జైస్వాల్‌కు అవకాశం ఇవ్వవచ్చు.

నంబర్-3లో సూర్య‌కుమార్ యాద‌వ్‌

ఇప్పుడు టాప్ 3 బ్యాట్స్‌మెన్ ఎవ‌ర‌నే విష‌యానికి వ‌స్తే.. సూర్యకుమార్ యాదవ్‌కు 3వ ర్యాంక్‌లో ఒక స్థానం అధికంగా ఆడే అవకాశం ఉంది. టీమ్ ఇండియా ఆరంభం నుంచి ఎటాక్‌ని కోరుకుంటోంది. దీని వల్ల సూర్యకి 4కి బదులు 3కి బ్యాటింగ్‌కు రావొచ్చు. ఆ తర్వాత రిషబ్ పంత్ వంటి డేరింగ్‌ బ్యాట్స్‌మెన్ నంబర్-4లో దిగిన ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. రిషబ్ పంత్ ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్ కావడం టీమ్ ఇండియాకు క‌లిసొచ్చే అంశం. కాగా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా 5వ స్థానంలో బ్యాటింగ్‌కు రావొచ్చు. సంజూ శాంసన్ లేదా శివమ్ దూబే నంబర్-6లో త‌మ స‌త్తా చూప‌నున్నారు.

Also Read: Vaddiraju: కాకతీయ కళా తోరణాన్ని తొలగించడం చాలా బాధాకరం : ఎంపీ వద్దిరాజు

మిడిల్ ఆర్డర్‌లో ఇబ్బంది

మిడిలార్డర్‌లో భారత జట్టు కొన్ని సమస్యలను ఎదుర్కొంటుంది. ఇందులో రెండు ఆప్షన్లు ఉన్నాయి. శివమ్ దూబే లేదా సంజు శాంసన్ ఎవరికి అవకాశం ఇవ్వాలి? ఇక్కడ ఒక సమస్య ఉంది. భారత జట్టుకు ఎడమచేతి వాటం ఎంపికలు చాలా ఉన్నాయి. జట్టులో రిషబ్ పంత్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా వంటి ఆట‌గాళ్లు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సంజూ శాంసన్‌కు అవకాశం ఇవ్వవచ్చని భావిస్తున్నారు. అనుభవజ్ఞుడైన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా నంబర్-7లో బ్యాటింగ్‌కు దిగే ఛాన్స్ ఉంది.

We’re now on WhatsApp : Click to Join

అక్షర్ పటేల్ గట్టి పోటీదారు

యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్‌లలో అక్షర్‌కు నంబర్-8లో ఒక‌రికి మాత్ర‌మే అవ‌కాశం ఇవ్వ‌నున్నారు. అక్షర్ కూడా చాలా బాగా బ్యాటింగ్ చేస్తాడు. టీ20 వంటి ఫార్మాట్‌లో బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌ కూడా టీమిండియాకు బోనస్‌గా నిలుస్తుంది. అక్షర్ అద్భుతమైన ఫీల్డర్ కూడా. ఇలాంటి పరిస్థితుల్లో చాహల్‌కు బదులుగా అక్షర్‌కు స్పిన్నర్‌గా అవకాశం కల్పించవచ్చు.

ఆ త‌ర్వాత జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ ఆర్డర్ తెలిసిందే. అయితే 9 మంది ఆటగాళ్ల విషయంలో పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఇద్ద‌రు ఆటగాళ్ల విషయంలో డైలమా ఉంది. కొన్ని విషయాలు పిచ్, మ్యాచ్ పరిస్థితులపై కూడా ఆధారపడి ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో తొలి మ్యాచ్‌లో టీమిండియా ఏ కాంబినేషన్‌తో బరిలోకి దిగుతుందనేది ఆసక్తికరంగా మారింది.