Site icon HashtagU Telugu

Day-Night Test: డే-నైట్ టెస్ట్ ప్రత్యేక రికార్డు.. టీమిండియా విజయాన్ని సూచిస్తుందా?

Team India

Team India

Day-Night Test: అడిలైడ్ టెస్టులో టీమిండియా వెనుకంజలో కనిపిస్తోంది. రెండో ఇన్నింగ్స్‌లోనూ టీమ్‌ ఇండియా పేలవ బ్యాటింగ్‌ కనిపించింది. రోహిత్‌ నుంచి విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్‌ వరకు మరోసారి ఫ్లాప్‌లని నిరూపించుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌ తర్వాత టీమిండియాపై ఆస్ట్రేలియా మంచి ఆధిక్యం సాధించింది. డే-నైట్ టెస్ట్ (Day-Night Test) మ్యాచ్‌ల గురించి ఇప్పుడు మ‌నం మాట్లాడుకుందాం. ఇందులో మొదటి ఇన్నింగ్స్ తర్వాత ఆధిక్యం సాధించిన తర్వాత కూడా జట్టు ఓడిపోయిన సంద‌ర్భాలు ఉన్నాయి.

ఈ రెండు జట్లూ రికార్డులను కలిగి ఉన్నాయి

డే-నైట్ టెస్ట్ మ్యాచ్‌లో ఆధిక్యం సాధించినా.. ఓడిపోయిన రికార్డు వెస్టిండీస్, భారత్ పేరిట ఉంది. 2018లో శ్రీలంక, వెస్టిండీస్ మధ్య డే-నైట్ టెస్ట్ మ్యాచ్ జరిగింది. వీరి తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 204 పరుగులకు ఆలౌటైంది. దీనికి సమాధానంగా శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 154 పరుగులకే కుప్పకూలింది. ఇటువంటి పరిస్థితిలో వెస్టిండీస్ ఆధిక్యం సాధించింది. కానీ రెండవ ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ జట్టు కేవలం 93 ​​పరుగులకు ఆలౌట్ కావడంతో, శ్రీలంక మ్యాచ్‌ను సులభంగా గెలుచుకుంది.

Also Read: Speaker Gaddam Prasad Kumar: నెక్లెస్ రోడ్డులో ఫుడ్ స్టాళ్లను ప్రారంభించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

ఇది కాకుండా 2020వ సంవత్సరంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా పింక్ బాల్‌తో భారత్, ఆస్ట్రేలియా మధ్య డే-నైట్ టెస్ట్ జ‌రిగింది. ఆ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ తర్వాత భారతదేశం 53 పరుగుల ఆధిక్యంలో ఉంది. కానీ తర్వాత ఇన్నింగ్స్‌లో మొత్తం భారత జట్టు కేవలం 36 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా మ్యాచ్‌ను సులభంగా గెలుచుకుంది.

టీమ్ ఇండియా ఇప్పుడు పెద్ద ఫీట్ చేస్తుందా?

ఇప్పుడు అడిలైడ్ డే-నైట్ టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ తర్వాత టీమిండియాపై ఆధిక్యం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 180 పరుగులకే కుప్పకూలగా, ఆ తర్వాత ఆస్ట్రేలియా 337 పరుగులకు ఆలౌటైంది. ఇలాంటి పరిస్థితుల్లో రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా భారీ విజయాన్ని సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే, ఇప్పుడు అది అంత ఈజీగా కనిపించడం లేదు. ఏం జ‌రుగుతుందో చూడాలి మ‌రి.!