Site icon HashtagU Telugu

Team India Failure : భారత్ ఓటమి నుంచి నేనేం నేర్చుకున్నానంటే.. ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్

Anand Mahindra

Anand Mahindra

Team India Failure : సోషల్ మీడియా ఫ్రెండ్లీగా ఉండే పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా .. వరల్డ్ కప్‌లో భారత్ ఓటమిపై స్పందించారు. ఇండియా టీమ్ ఓటమి నుంచి తానెంతో నేర్చుకున్నానంటూ ఆయన ఒక ట్వీట్ చేశారు. గెలుపోటముల గురించి.. జీవిత సత్యాల గురించి ఆనంద్ మహీంద్రా ఆసక్తికర కామెంట్స్ చేశారు. జీవితంలో ముందుకు సాగాలంటే ఓటమిని కూడా అంగీకరించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి సమయంలో భారత క్రీడాకారులకు అండగా నిలవాలని క్రికెట్ ఫ్యాన్స్‌కు పిలుపునిచ్చారు. ఈ వరల్డ్ కప్‌లో ఇండియా టీమ్ ఆశించిన దానికంటే ఎక్కువే విజయాలు సాధించిందని మహీంద్రా చెప్పారు. అణుకువను, వినయాన్ని నేర్పించడంలో క్రీడలకు మించిన గురువు ఎవరూ లేరని వ్యాఖ్యానించారు. ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా టీమ్ చివరిదాకా బాగా పోరాడిందని కితాబిచ్చారు. ఈమేరకు ఒక మెసేజ్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ ఆయన ఒక ఫొటోను షేర్ చేశారు. మరో అవకాశం కోసం.. మరో అద్భుతం చేసేందుకు ఒంటరిగా ఎదురుచూస్తున్న ఓ వ్యక్తిని ఆ ఫొటోలో మనం చూడొచ్చు. ఈ ట్వీట్‌పై నెటిజన్లు బాగా స్పందించారు. గెలుపు కోసం పోరాడిన టీమిండియాపై ప్రశంసలు కురిపించారు.

We’re now on WhatsApp. Click to Join.

తాను క్రికెట్ మ్యాచ్‌‌ను లైవ్‌‌లో చూసినప్పుడల్లా  భారత జట్టు ఓటమి పాలవుతోందనే ఫీలింగ్‌లో ఆనంద్ మహీంద్రా ఉన్నారు. అందుకే ఆయన ఈసారి(ఆదివారం) వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌ను చూడలేదు. మ్యాచ్‌కు ముందు మహీంద్రా ఒక ట్వీట్ చేస్తూ..  ‘‘నేను వరల్డ్‌ కప్‌  ఫైనల్‌ మ్యాచ్‌ చూడడానికి ప్లాన్‌ చేసుకోవడం లేదు. ఇది దేశానికి నేను చేస్తున్న సేవ. కానీ టీమిండియా జేర్సీ ధరించి ఓ గదికి పరిమితమవుతాను. ఎవరైనా వచ్చి మనం గెలిచామని చెప్పే దాకా బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా ఉంటాను’’ అని తెలిపారు. ఫైనల్‌లో ఇండియా టీమ్ ఓడిపోయిందని తెలియడంతో తన ఫీలింగ్స్‌ను వ్యక్తపరుస్తూ ఆయన(Team India Failure) మరో ట్వీట్ చేశారు.

Also Read: Tortoise Ring : తాబేలు ఉంగరంతో కలిగే ప్రయోజనాలు తెలుసా ?