Rohit Idea: ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భారత్ వన్డే సిరీస్‌లోనూ ఆదరగొడుతోంది. తొలి వన్డేలో 4 వికెట్లు తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌట్ అవగా…చేదనలో 6 వికెట్లు కోల్పోయి 38.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సాధించింది. ఫిబ్రవరి 9న కటక్ వేదికగా రెండో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్ ఇంగ్లాండ్ కు కీలకంగా మారింది. ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తే వన్డే సిరీస్ మనదే అవుతుంది. అయితే ఇప్పటికే టి20 సిరీస్ చేజార్చుకున్న ఇంగ్లీష్ జట్టు వన్డే సిరీస్ లో ఎలాగైనా గెలవాలనుకుంటుంది. ఈ నేపథ్యంలో రెండో వన్డేను ఇరు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 107 వన్డేలు జరగ్గా అందులో భారత్ 58, ఇంగ్లాండ్ 44 మ్యాచులో విజయం సాధించాయి..
రెండో వన్డేలో బరిలోకి దిగే టీమిండియా తుది జట్టును పరిశీలిస్తే రోహిత్ శర్మ (Rohit Idea) సారథ్యంలోని భారత జట్టు అన్ని విభాగాల్లోనూ బలంగా కనిపిస్తోంది. గాయం కారణంగా తొలి వన్డేకు దూరంగా ఉన్న సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ జట్టులోకి రానుండగా..యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మీద వేటు పడనున్నట్లు తెలుస్తోంది. ఇది మినహా రోహిత్ ప్రయోగాల జోలికి వెళ్లే ఆలోచనలో లేనట్లు తెలుస్తుంది. జైస్వాల్ రెండో వన్డేలో ఆడకపోతే రోహిత్ శర్మకు జోడిగా శుబ్ మాన్ గిల్ ఓపెనర్ గా బరిలోకి దిగే అవకాశం ఉంది. మూడో స్థానంలో విరాట్ కోహ్లీ, నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్, ఐదో స్థానంలో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ కు రానుండగా… ఆల్ రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాతో పాటుగా అక్షర్ పటేల్ లు బరిలోకి దిగనున్నారు. కల్దీప్ యాదవ్ మరోసారి స్పెషలిస్ట్ స్పిన్నర్ రోల్ పోసించనుండగా… పేస్ బౌలింగ్ బాధ్యతల్ని హర్షిత్ రానాతో కలసి సీనియర్ పేసర్ మహ్మద్ షమి పంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: Infosys : ట్రైనీలకు షాకిచ్చిన ఇన్ఫోసిస్.. 400 మందికి ఉద్వాసన !
రెండో వన్డేలో రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉండగా జట్టులో శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రానా, మహ్మద్ షమిలు చోటు దక్కించుకున్నారు.