IPL Mega Auction: ఐపీఎల్ 2025 ఆక్షన్ కు ఆటగాళ్ల పైనల్ లిస్ట్ ఇదే!
Kode Mohan Sai
Retire From IPL
IPL Mega Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మెగా వేలానికి సమయం దగర పడుతుంది. నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఈ వేలం జరగనుంది. ఈ వేలం కోసం అన్ని ఫ్రాంఛైజీలు కూడా సిద్ధమయ్యాయి. మొత్తంగా 1,574 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో 320 మంది క్యాప్డ్ ఆటగాళ్లు కాగా, 1,224 మంది అన్‌క్యాప్డ్ ఆటగాళ్లు ఉన్నారు. అలాగే, అసోసియేట్ దేశాలకు చెందిన 30 మంది క్రికెటర్లు కూడా ఈ వేలం కోసం రిజిస్టర్ అయ్యారు. మొత్తం 1,574 క్రికెటర్లలో, ఫ్రాంఛైజీలు గరిష్టంగా 204 మందిని మాత్రమే కొనుగోలు చేసే అవకాశం ఉంది.
షార్ట్‌లిస్ట్ జాబితా విడుదల:
వేలానికి గడువు సమీపించడంతో, ఐపీఎల్ పాలకమండలి రిజిస్టర్ చేసిన ఆటగాళ్ల నుంచి షార్ట్‌లిస్ట్‌ను ప్రకటించింది. ఫ్రాంఛైజీల ఆసక్తి, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ జాబితా తయారు చేయబడింది. మొత్తం 1,574 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నప్పటికీ, వారిలో 574 మందిని మాత్రమే షార్ట్‌లిస్ట్ చేశారు. ఈ 574 మంది ఆటగాళ్ల జాబితాను ఐపీఎల్ పాలకమండలి సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది.
షార్ట్‌లిస్ట్‌లో చోటు సాధించిన 574 మంది క్రికెటర్లలో, ఐపీఎల్ ఫ్రాంఛైజీలు గరిష్టంగా 204 మందిని మాత్రమే ఎంపిక చేసుకోవచ్చునని తెలుస్తోంది. ఈ ఎంపికలో 70 మంది విదేశీ ఆటగాళ్లను తీసుకోవచ్చు. తుది జాబితాలో భారత క్యాప్‌డ్ ప్లేయర్లు 48 మంది, విదేశీ క్యాప్‌డ్ ప్లేయర్లు 193 మంది, అన్‌క్యాప్‌డ్ భారత ఆటగాళ్లు 318 మంది, విదేశీ అన్‌క్యాప్‌డ్ ఆటగాళ్లు 12 మంది ఉన్నారు. అలాగే, ముగ్గురు అసోసియేట్ దేశాలకు చెందిన క్రికెటర్లు కూడా ఈ వేలంలో పాల్గొననున్నారు.
ఆటగాళ్ల బేస్ ప్రైజ్ లిస్టు విడుదల:
వేలానికి నమోదు చేసిన ఆటగాళ్ల బేస్ ప్రైజ్‌పై 8 స్లాట్లు ఖరారు చేయబడ్డాయి. అందులో గరిష్ట బేస్ ప్రైజ్ రూ. 2 కోట్లు కాగా, కనిష్ట బేస్ ప్రైజ్ రూ. 30 లక్షలు. రూ. 2 కోట్ల కనిష్ట ధరతో 81 మంది ఆటగాళ్లు వేలంలోకి వస్తున్నారు. మరోవైపు, రూ. 30 లక్షల కనిష్ట ధరతో అత్యధికంగా 320 మంది ఆటగాళ్లు ఈ వేలంలో పాల్గొననున్నారు.
Capped And Uncapped Players
నవంబర్ 24న ప్రారంభం:
ఐపీఎల్ 2025 మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో జరగనుంది. భారత కాలమానం ప్రకారం, నవంబర్ 24న మధ్యాహ్నం 12:30 గంటల నుండి ఈ వేలం ప్రారంభమవుతుంది. రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వంటి ప్రముఖ ఆటగాళ్లు వేలంలోకి రాబోతున్నందున, వారిని ఎవరు తమ జట్టులో చేర్చుకుంటారనే విషయంపై ఆసక్తి పెరిగింది.