MS Dhoni: ఎంఎస్ ధోనీపై షాకింగ్ కామెంట్స్.. ధోనీకి ఇదే ఆఖరి ఐపీఎల్ అంటూ కారణాలు చెప్పిన జాదవ్..!

ఐపీఎల్‌ నుంచి మహేంద్రసింగ్‌ ధోనీ (MS Dhoni) రిటైర్‌మెంట్‌ గురించిన వార్తలు కొత్తేమీ కాదు. ఈ సీజన్‌లో రిటైర్మెంట్(Retirement) తీసుకుంటాడని గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్నా ఇప్పటి వరకు అది జరగలేదు.

  • Written By:
  • Publish Date - April 15, 2023 / 11:35 AM IST

ఐపీఎల్‌ నుంచి మహేంద్రసింగ్‌ ధోనీ (MS Dhoni) రిటైర్‌మెంట్‌ గురించిన వార్తలు కొత్తేమీ కాదు. ఈ సీజన్‌లో రిటైర్మెంట్(Retirement) తీసుకుంటాడని గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్నా ఇప్పటి వరకు అది జరగలేదు. 41 ఏళ్ల వయసులో కూడా ధోనీ చెన్నై సూపర్ కింగ్స్‌లో ఫిటెస్ట్ ప్లేయర్‌లలో ఒకడు. అతను తన కెప్టెన్సీలో చెన్నైకి నాలుగు టైటిళ్లను గెలిపించాడు.చివరి టైటిల్ రెండేళ్ల క్రితం అంటే 2021లో వచ్చింది. ఇంతకుముందు ఆ జట్టు 2010, 2011, 2018లో కూడా ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది.

CSK ఫిటెస్ట్ ప్లేయర్లలో ధోనీ ఒకడు

ఇప్పటివరకు ఈ ఐపీఎల్‌లో ధోని బ్యాటింగ్‌తో పాటు వికెట్‌కీపింగ్‌లోనూ అద్భుతంగా రాణించాడు. తొలి మ్యాచ్‌లో గాయపడినప్పటికీ ధోని బ్యాటింగ్‌తో కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. వికెట్ కీపింగ్‌లో కూడా కొన్ని మంచి క్యాచ్‌లు పట్టాడు. ప్రతిసారీ మాదిరిగానే ఈ ఏడాది కూడా ఈ ఐపీఎల్ తర్వాత ధోనీ రిటైర్మెంట్ తీసుకుంటాడని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ధోని రిటైర్మెంట్‌పై టీమిండియా బ్యాట్స్‌మెన్, సీఎస్‌కే మాజీ క్రికెటర్ కేదార్ జాదవ్ ఓ ప్రకటన ఇచ్చాడు. ధోని లేకుండా ఆడేందుకు చెన్నై జట్టు సిద్ధంగా ఉందా అని ప్రశ్నించగా? దీనిపై కేదార్ మాట్లాడుతూ ధోనీకి ఇదే చివరి సీజన్ అని అన్నాడు.

Also Read: Jasprit Bumrah: త్వరలో టీమిండియా జట్టులోకి జస్ప్రీత్ బుమ్రా..! ఆ మెగా టోర్నీకి అందుబాటులో..?

ధోని గురించి కేదార్ జాదవ్ ఏమన్నాడు..?

ధోనీకి ఇదే చివరి సీజన్ అని కేదార్ జాదవ్ పేర్కొన్నాడు. ధోనీకి వయసు పెరుగుతోందని, దీంతో ఆయనపై ఒత్తిడి పెరుగుతోందని తెలిపాడు. అతను లేకుండా జట్టు ఆడేందుకు సిద్ధంగా లేదని చెప్పాడు. అభిమానులు కూడా సిద్ధంగా లేరని పేర్కొన్నాడు. కేదార్ మాట్లాడుతూ.. MS ధోని లేకుండా ఆడటానికి CSK సిద్ధంగా లేద అని అన్నాడు. ఐపీఎల్‌లో సీఎస్‌కే తరఫున ఆడుతున్న ధోనీకి ఇది చివరి సంవత్సరం అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అతనికి మరికొన్ని నెలల్లో 42 సంవత్సరాలు వస్తాయి అని అన్నాడు.

2008లో ఐపీఎల్ ప్రారంభ సీజన్‌లో ధోని CSK ఫ్రాంచైజీలో చేరాడు. అప్పటి నుంచి ఐపీఎల్‌లో ఎప్పుడూ ఒకే జట్టులో భాగమయ్యాడు. 2016, 2017లో CSK నిషేధించబడిన తర్వాత ధోని రైజింగ్ పూణె సూపర్‌జెయింట్స్‌కు రెండు ఎడిషన్‌లు ఆడాడు. 2018లో జట్టు తిరిగి వచ్చిన వెంటనే ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు టైటిల్ గెలుచుకుంది. ఐపీఎల్ 2020 నుంచి ధోనీ తన బ్యాటింగ్ ఆర్డర్‌ను తగ్గించాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు బాగానే బ్యాటింగ్ చేస్తున్నాడు. ప్రస్తుత సీజన్‌లో అతను నాలుగు మ్యాచ్‌లలో 214.81 స్ట్రైక్ రేట్, 58 సగటుతో 58 పరుగులు చేశాడు. అతను ఇప్పటివరకు 238 IPL మ్యాచ్‌లలో 39.34 సగటుతో 135.78 స్ట్రైక్ రేట్‌తో 5036 పరుగులు చేశాడు. ఇది కాకుండా 138 క్యాచ్‌లు తీసుకోగా, 39 స్టంపింగ్‌లు చేశాడు.