Jay Shah: ఈ ఐపీఎల్ మరువలేనిది.. క్రికెట్ అభిమానులు మళ్లీ స్టేడియంకు రావడం సంతోషకర పరిణామం : జే షా

ఐపీఎల్ విజేతగా గుజరాత్ టైటాన్స్ నిలిచింది. సొంతగడ్డపై రాజస్థాన్ రాయల్స్ టీమ్ ను పోరాడి ఓడించింది.

  • Written By:
  • Publish Date - May 30, 2022 / 12:58 PM IST

ఐపీఎల్ విజేతగా గుజరాత్ టైటాన్స్ నిలిచింది. సొంతగడ్డపై రాజస్థాన్ రాయల్స్ టీమ్ ను పోరాడి ఓడించింది. ఈ మ్యాచ్ ఫలితం పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు, బీసీసీఐ కార్యదర్శి జే షా హర్షం వ్యక్తం చేశారు. ఈసారి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్.. స్టేడియం నిండా జనంతో జరగడాన్ని ఆనందకరమైన పరిణామంగా అభివర్ణించారు. అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియం క్రికెట్ ప్రియులతో కళకళలాడిందని పేర్కొన్నారు.

” ఐపీఎల్ ఛాంపియన్స్ గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ కు, ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు నా అభినందనలు. భారీ అభిమాన జన సందోహం నడుమ ఈ ఫైనల్ మ్యాచ్ జరిగింది. చాలా గ్యాప్ తర్వాత క్రికెట్ ప్రియులు స్టేడియంలో కేరింతలు కొడుతూ కనిపించారు” అని పేర్కొంటూ జే షా ట్వీట్ చేశారు. కాగా, 2021 ఐపీఎల్ లో కొవిడ్ భయాలతో మ్యాచ్ ల సంఖ్యను గణనీయంగా తగ్గించారు. ఆ మ్యాచ్ లను కూడా దుబాయ్ వేదికగా నిర్వహించారు. ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్ లన్నీ ఇండియాలోనే జరిగాయి.

తొలుత స్టేడియంలలోకి 50 శాతం మంది అభిమానులనే అనుమతించారు. క్రమంగా ఈ సంఖ్యను పెంచుతూ, ఫైనల్ మ్యాచ్ సమయానికి 100 శాతం టికెట్లు అమ్మారు. ఫైనల్ మ్యాచ్ లో బౌలింగ్ తో అదరగొట్టిన హార్దిక్ పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది.