RCB: ఐపీఎల్ 2025 విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అమ్మకానికి సిద్ధమైంది. జట్టు యజమాన్యం కొత్త కొనుగోలుదారు కోసం అన్వేషిస్తున్నట్లు ప్రకటించింది. ఈ జట్టును కొనుగోలు చేయడంలో పలువురు వ్యాపారవేత్తలు, కంపెనీలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా భారతీయ సంతతికి చెందిన బిలియనీర్ సంజయ్ గోవిల్ పేరు ఈ జాబితాలో చేరింది. క్రికెట్‌పై ఆయనకు ఎంతో ఆసక్తి ఉంది. ఇప్పటికే ఆయనకు రెండు క్రికెట్ జట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆయన RCBని కొనుగోలు చేయడంలోనూ ఆసక్తి చూపిస్తున్నారు.
RCB కొనుగోలు రేసులో కొత్త పేరు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును కొనుగోలు చేయడంలో భారతీయ సంతతికి చెందిన అమెరికన్ వ్యాపారవేత్త సంజయ్ గోవిల్ ఆసక్తి చూపారు. ఆయన గ్లామోర్గాన్ క్రికెట్ క్లబ్‌తో కలిసి RCBని కొనుగోలు చేసే అవకాశం ఉంది. గోవిల్‌కు ఇప్పటికే రెండు క్రికెట్ లీగ్‌లలో జట్లు ఉన్నాయి. వాటిని ఆయన కోట్లాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశారు. ‘ది హండ్రెడ్’ లీగ్‌లో వెల్ష్ ఫైర్, మేజర్ లీగ్ క్రికెట్‌లో వాషింగ్టన్ ఫ్రీడమ్ అనే జట్లకు ఆయన యజమానిగా ఉన్నారు. ఈ జట్లను కూడా ఆయన గ్లామోర్గాన్ క్లబ్‌తో కలిసి కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆయన దృష్టి ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ప్రజాదరణ పొందిన జట్టు అయిన RCBపై పడింది. సంజయ్ గోవిల్ గ్లామోర్గాన్ క్లబ్‌తో కలిసి బిగ్ బాష్ లీగ్‌లో కూడా ఒక జట్టును కొనుగోలు చేయాలని చూస్తున్నారు., అలాగే ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ జట్టుకు యజమానిగా మారడానికి కూడా ఆయన ఆసక్తి చూపుతున్నారు.
Also Read: Jagan : చంద్రబాబుపై చీటింగ్ కేసు పెట్టాలి – జగన్ డిమాండ్
RCB ఎందుకు అమ్ముడవుతోంది?
RCB యాజమాన్యం డియాజియో సంస్థ వద్ద ఉంది. గత ఐపీఎల్‌లో విజయం సాధించిన తర్వాత ఈ జట్టు చాలా వివాదాల్లో చిక్కుకుంది. బహుశా ఇదే కారణంగా వారు జట్టును అమ్మేయాలని నిర్ణయించుకొని ఉండవచ్చు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత విలువైన జట్లలో ఇది ఒకటి. కాబట్టి దీనిని విక్రయించడం వ్యాపారపరంగా డియాజియోకు లాభదాయకంగా ఉంటుంది. ఈ కారణంగానే వారు RCBని అమ్మకానికి ఉంచారు. మార్చి 2026 నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని వారు ఆశిస్తున్నారు. RCB సుమారు రూ. 20 వేల కోట్లకు అమ్ముడుపోతుందని డియాజియో అంచనా వేస్తోంది.
ఐపీఎల్ 2026 కోసం RCB రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు వీరే!
రజత్ పాటిదార్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, కృనాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, జాకబ్ బెథెల్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్, భువనేశ్వర్ కుమార్, నువాన్ తుషార, రసిఖ్ సలామ్, అభినందన్ సింగ్, సుయష్ శర్మ.
