Thipatcha Putthawong: నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు

నెదర్లాండ్స్‌తో జరిగిన టీ20ల్లో థాయ్‌లాండ్‌కు చెందిన లెఫ్టార్మ్ స్పిన్నర్ తిప్చా పుత్తావాంగ్ బౌలింగ్ తో అదరగొట్టింది. నాలుగు బంతులు వేసి నాలుగు వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించింది.

Thipatcha Putthawong: నెదర్లాండ్స్‌తో జరిగిన టీ20ల్లో థాయ్‌లాండ్‌కు చెందిన లెఫ్టార్మ్ స్పిన్నర్ తిప్చా పుత్తావాంగ్ బౌలింగ్ తో అదరగొట్టింది. నాలుగు బంతులు వేసి నాలుగు వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో మహిళల మరియు పురుషుల జట్లలో 4 బంతుల్లో 4 వికెట్లు తీసిన ఏడో క్రీడాకారిణి ఆమె.

నెదర్లాండ్స్‌తో జరిగిన టీ20 మ్యాచ్ 18వ ఓవర్‌లో నాలుగు వరుస బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టింది. 18వ ఓవర్‌లో ఫేబ్ మోల్కెన్‌బౌర్, మిక్కి జ్విల్లింగ్, హన్నా లంధీర్ మరియు కరోలిన్ డి లాంగే వికెట్లు తీసుకుంది. విశేషం ఏంటంటే ఆ నలుగురు ప్లేయర్స్ బౌల్డ్ అయ్యారు. 19 ఏళ్ల పుత్తావాంగ్ కు ఈ ఏడాది మేలో ఐసిసి ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు కూడా లభించింది. కంబోడియాలో జరిగిన సౌత్ ఈస్ట్ ఏషియన్ గేమ్స్‌లో థాయ్‌లాండ్ మహిళ బంగారు పతకం సాధించడంలో ఆమె కీలక పాత్ర పోషించింది.

Read More: KTR: కటిక చీకట్ల కాంగ్రెస్ కావాలా.. కరెంట్ వెలుగుల బిఆర్ఎస్ కావాలా: కేటీఆర్