Site icon HashtagU Telugu

MS Dhoni: చెన్నై బౌలర్లకు వార్నింగ్ ఇచ్చిన ధోనీ.. ఇలానే చేస్తే కొత్త కెప్టెన్ కింద ఆడాల్సి ఉంటుందని హెచ్చరిక..!

Dhoni As Uncapped Player

Dhoni As Uncapped Player

ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్ తమ రెండో మ్యాచ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ తో ఆడింది. చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) నేతృత్వంలోని సీఎస్‌కే 12 పరుగుల తేడాతో విజయం సాధించి టోర్నీలో ఖాతా తెరిచింది. ఈ మ్యాచ్‌లో విజయం తర్వాత కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ తన జట్టు బౌలర్లపై అసంతృప్తిగా కనిపించాడు. కెప్టెన్సీని వదులుకోవడం గురించి కూడా మాట్లాడాడు. మరోసారి ఇలా జరగొద్దని బౌలర్లకు సూచించారు. పరిస్థితిలో మార్పు రాకపోతే కొత్త కెప్టెన్ కింద ఆడాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇది తన రెండో హెచ్చరిక అని చెప్పారు.

ఫాస్ట్ బౌలర్లపై అసంతృప్తి

మ్యాచ్ అనంతరం మహేంద్ర సింగ్ ధోనీ మాట్లాడుతూ.. ఫాస్ట్ బౌలింగ్‌లో మరింత మెరుగుదల అవసరం. పరిస్థితిని బట్టి బౌలింగ్‌ చేయాలి. ప్రత్యర్థి బౌలర్లు ఏం చేస్తున్నారో గమనించడం ముఖ్యం. మరో విషయం ఏమిటంటే బౌలర్లు నో బాల్స్, ఎక్స్‌ట్రా వైడ్‌లు వేయకూడదు. అలానే చేస్తే కొత్త కెప్టెన్ కింద ఆడాల్సి ఉంటుంది. ఇది వారికీ నేను ఇస్తున్న నా రెండవ హెచ్చరిక అని అన్నారు.

Also Read: Ruturaj Gaikwad: రుతురాజ్ సిక్స్ అదుర్స్.. కారు డ్యామేజ్.. వీడియో వైరల్..!

లక్నోతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ గెలిచినప్పటికీ ఈ మ్యాచ్‌లో CSK బౌలర్లు చాలా పేలవమైన రిథమ్‌లో కనిపించారు. ఈ మ్యాచ్ లో చెన్నై బౌలర్లు మొత్తం 3 నో బాల్స్, మొత్తం 13 వైడ్ బాల్స్ వేశారు. ఈ విధంగా జట్టు 18 అదనపు పరుగులు వెచ్చించింది. అదే సమయంలో లక్నో బౌలర్లు కూడా ఈ విషయంలో వెనకడుగు వేయలేదు. ఈ మ్యాచ్‌లో లక్నో బౌలర్లు 1 నోబాల్, 7 వైడ్ బాల్స్ వేశారు. మొదటి మ్యాచ్‌లో కూడా చెన్నై బౌలర్లు 2 నో బాల్స్, 4 వైడ్ బాల్స్‌ను వేసిన విషయం తెలిసిందే.

Exit mobile version