Site icon HashtagU Telugu

IPL 2026 Auction: ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఈ ఆటగాళ్లు వేలంలోకి ఎందుకు రాలేకపోతున్నారు?

IPL 2026 Auction

IPL 2026 Auction

IPL 2026 Auction: ఐపీఎల్ 2026 సీజన్ కోసం ఆటగాళ్ల మినీ వేలం అబుదాబిలో డిసెంబర్ 16న జరగనుంది. ఈ వేలంలో గరిష్టంగా 77 మంది ఆటగాళ్లపై మాత్రమే బిడ్స్ వేసే అవకాశం ఉంది. మొత్తం 10 ఫ్రాంఛైజీలు వచ్చే సీజన్ కోసం ఇప్పటికే 173 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. దీంతో 77 స్లాట్‌లు ఖాళీగా మిగిలాయి. ఆండ్రీ రసెల్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, డేవిడ్ మిల్లర్ వంటి దిగ్గజ టీ20 స్పెషలిస్ట్‌లు ఈ వేలంలో పాల్గొనే అవకాశం ఉంది. అయితే కొంతమంది కీలక ఆటగాళ్లు మాత్రం ఐపీఎల్ 2026 మినీ వేలంలో (IPL 2026 Auction) పాల్గొనలేకపోతున్నారు.

BCCI రూపొందించిన కొత్త నిబంధనలు

IPL 2025 మెగా వేలానికి ముందు బీసీసీఐ (BCCI) వేలానికి సంబంధించి కొన్ని కొత్త నిబంధనలను రూపొందించింది

  1. మొదటి నిబంధన: ఏదైనా విదేశీ ఆటగాడు మెగా వేలం కోసం తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒకవేళ ఆ ఆటగాడు వేలం కోసం పేరు నమోదు చేసుకోకపోతే, అతను తదుపరి సీజన్‌లో జరిగే మినీ వేలంలో పాల్గొనడానికి అనర్హుడు అవుతాడు.
  2. రెండవ నిబంధన: ఒక ఆటగాడు వేలంలో కొనుగోలు చేయబడిన తర్వాత సీజన్ ప్రారంభానికి ముందే తన పేరును ఉపసంహరించుకుంటే, అతనిపై వేలంలో పాల్గొనకుండా, టోర్నమెంట్‌లో ఆడకుండా 2 సంవత్సరాల పాటు నిషేధం విధించబడుతుంది.

Also Read: Prabhas: జపాన్ కు వెళ్లనున్న ప్రభాస్.. కారణం ఇదే!

వేలంలో పాల్గొనలేని 3 కీలక ఆటగాళ్లు

కొత్త నిబంధనల కారణంగా ఈ ముగ్గురు అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు IPL 2026 మినీ వేలంలో కనిపించరు.

బెన్ స్టోక్స్ (Ben Stokes): ఇంగ్లాండ్‌ టెస్ట్ కెప్టెన్ అయిన బెన్ స్టోక్స్ ఈ జాబితాలో ఉన్నారు. అతను గత సంవత్సరం జరిగిన మెగా వేలంలో తన పేరును నమోదు చేసుకోలేదు. తన ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టడానికి, ఇంగ్లాండ్‌కు తన కెరీర్‌ను పొడిగించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో చెప్పారు. రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడం వల్ల బెన్ స్టోక్స్ ఇప్పుడు మినీ వేలంలో భాగం కాలేరు.

హ్యారీ బ్రూక్ (Harry Brook): ఇంగ్లాండ్‌ వన్డే, టీ20 జట్టు కెప్టెన్ హ్యారీ బ్రూక్ 2024లో తన నానమ్మ మరణం కారణంగా IPL నుండి తప్పుకున్నాడు. అయితే, 2025 మెగా వేలంలో అతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 6.25 కోట్లకు కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన తర్వాత ఇంగ్లాండ్ కెరీర్‌పై దృష్టి పెట్టాలని చెబుతూ టోర్నమెంట్ నుండి పేరును ఉపసంహరించుకున్నాడు. ఈ కారణంగా BCCI నిబంధనల ప్రకారం అతను ఈ సంవత్సరం వేలంలోకి రాలేడు.

జేసన్ రాయ్ (Jason Roy): ఇంగ్లాండ్‌కు చెందిన విధ్వంసక ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ జేసన్ రాయ్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. అతను వ్యక్తిగత కారణాల వల్ల IPL 2024 నుండి తప్పుకున్నాడు. అలాగే 2025 మెగా వేలంలో కూడా అతని పేరు లేదు. 2025 వేలంలో లేకపోవడం వల్ల అతను IPL 2026 మినీ వేలంలో పాల్గొనడానికి అవకాశం లేదు.

Exit mobile version