Ind vs SL ODI Preview: వరల్డ్‌కప్‌కు జట్టు కూర్పే టార్గెట్… శ్రీలంకతో వన్డే పోరుకు భారత్ రెడీ

వన్డే ప్రపంచకప్‌ కోసం టీమిండియా సన్నాహాలు షురూ కాబోతున్నాయి. సొంతగడ్డపై జరిగే మెగాటోర్నీకి జట్టు కూర్పును సన్నద్ధం చేయడమే లక్ష్యంగా లంకతో వన్డే సిరీస్‌కు రెడీ అవుతోంది.

  • Written By:
  • Publish Date - January 9, 2023 / 09:50 PM IST

Ind vs SL ODI Preview: వన్డే ప్రపంచకప్‌ కోసం టీమిండియా సన్నాహాలు షురూ కాబోతున్నాయి. సొంతగడ్డపై జరిగే మెగాటోర్నీకి జట్టు కూర్పును సన్నద్ధం చేయడమే లక్ష్యంగా లంకతో వన్డే సిరీస్‌కు రెడీ అవుతోంది. కెప్టెన్ రోహిత్‌తో పాటు కోహ్లీ, రాహుల్ వంటి సీనియర్లు తిరిగి వచ్చిన వేళ యువ క్రికెటర్లలో ఎవరికి చోటు దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.
శ్రీలంకపై టీ ట్వంటీ సిరీస్‌ విజయంతో కొత్త ఏడాదిని ఘనంగా ఆరంభించిన భారత్ ఇప్పుడు వన్డే సిరీస్‌కు రెడీ అయింది. వన్డే ప్రపంచకప్‌కు ఇంకా కొన్ని నెలలే మిగిలి ఉండడంతో జట్టు కూర్పుపై దృష్టి పెట్టింది. ఈ సిరీస్ నుంచే మిషన్ ప్రపంచకప్‌ సన్నాహాలు మొదలుపెడుతోంది. టీ ట్వంటీలకు విశ్రాంతి తీసుకున్న సీనియర్ ఆటగాళ్ళు జట్టులోకి తిరిగి వచ్చారు. కెప్టెన్ రోహిత్‌శర్మ, కోహ్లీతో పాటు కెఎల్ రాహుల్ రీఎంట్రీతో జట్టు కూర్పు ఆసక్తికరంగా మారింది. రోహిత్‌తో కలిసి శుభ్‌మన్‌ గిల్ ఇన్నింగ్స్ ఆరంభించనుండగా.. ఇషాన్‌ కిషన్‌ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. మూడో స్థానంలో కోహ్లీ దిగనుండగా..అటు నాలుగో స్థానానికి పోటీ నెలకొంది.

సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్‌ పోటీపడుతుండగా.. ఇద్దరూ ఫామ్‌లో ఉండడంతో ఎవరికి చోటు దక్కుతుందనేది వేచి చూడాలి. శ్రీలంకతో చివరి టీ ట్వంటీ లో మెరుపు శతకం సాధించిన సూర్యకుమార్ వన్డేలోనూ ఈ ప్లేస్ కు రేసులో ముందున్నాడు. అయితే శ్రేయస్ అయ్యర్ వన్డేల్లో అత్యంత నిలకడైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. 2022లో ఈ ఫార్మాట్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్ గా నిలిచాడు. ఐదో స్థానంలో కెఎల్ రాహుల్, ఆరో స్థానంలో హార్థిక్ పాండ్యా బ్యాటింగ్‌కు రానున్నారు.

బౌలింగ్‌ కాంబినేషన్‌లో బూమ్రా దూరమవడంతో పేస్ విభాగాన్ని మహ్మద్ షమీ లీడ్ చేయనున్నాడు. అతనితో పాటు సిరాజ్, అర్షదీప్‌సింగ్‌లలో ఒకరికి చోటు దక్కనుండగా..ఉమ్రాన్‌ మాలిక్‌కు చోటు ఖాయంగా కనిపిస్తోంది. వరల్డ్ కప్ కు ఇప్పటి నుంచే బౌలింగ్ కూర్పు పై ఫోకస్ చేయనుంది. అటు స్పిన్నర్లుగా వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్‌ కీలకం కానున్నారు. లంకపై బ్యాట్‌తోనూ రాణించిన అక్షర్‌పై అంచనాలు పెరిగాయి.

నల్ గా వరల్డ్ కప్ కి ముందు కాంబినేషన్ ను సరి చూసుకోవడమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతోందిఇదిలా ఉంటే టీ ట్వంటీ సిరీస్‌ ఓడినప్పటకీ లంక గట్టిపోటీనే ఇచ్చింది. దీంతో ఆ జట్టును తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో హోరాహోరీ పోరు ఖాయమని చెప్పొచ్చు. ఇక మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న గౌహతి బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశముండడంతో భారీస్కోర్లు ఖాయమని అంచనా వేస్తున్నారు.