Virat Kohli(VK): మోస్ట్ వ్యాలిబుల్ సెలెబ్రెటీ స్థానాన్ని పొగొట్టుకున్న ఆ స్టార్ క్రికెటర్!మోస్ట్ వ్యాలిబుల్ సెలెబ్రెటీ స్థానాన్ని పొగొట్టుకున్న ఆ స్టార్ క్రికెటర్!

క్రికెటర్ కోహ్లి కోట్ల మంది ఫ్యాన్సుని సంపాదించుకున్నాడు.

Published By: HashtagU Telugu Desk
Cricket Wc 2019

Cricket Wc 2019

Virat Kohli(VK): క్రికెటర్ కోహ్లి కోట్ల మంది ఫ్యాన్సుని సంపాదించుకున్నాడు. మైదానంలో కోహ్లి ఆటను చూసేందుకు లక్షల మంది ఫ్యాన్సు క్యూ కడుతారు. సోషల్ మీడియాలో ఒక్క పోస్టు పెడితే చాలు లైకులు వరదై పారుతాయి. ఇక ఆయన బ్రాండ్ వ్యాల్యు ఎటువంటిదో అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఆ వ్యాల్యు తగ్గిందని చర్చ నడుస్తోంది.

తాజా లెక్కల ప్రకారం 2022లో క్రికెటర్ విరాట్ కోహ్లీ యొక్క చర్చనీయాంశమైన ఆన్-ఫీల్డ్ ఫామ్ 2022లో అతని బ్రాండ్ విలువను దెబ్బతీసినట్లు కనిపిస్తోంది. కన్సల్టింగ్ సంస్థ క్రోల్ నివేదిక ప్రకారం విరాట్ మొత్తం బ్రాండ్ విలువ 2021లో USD 185.7 మిలియన్లు. అదే 2020లో USD 237.7 మిలియన్లుగా ఉంది. ప్రస్తుతం 176.9 మిలియన్లకు పడిపోయింది.

ఇదే క్రమంలో మిగిలిన సెలెబ్రెటీలది చూస్తే… 2021లో అక్షయ్ కుమార్‌ను అధికమించి రెండవ అత్యంత విలువైన సెలబ్రిటీగా అవతరించిన నటుడు రణవీర్ సింగ్. 2022లో కోహ్లి కంటే 181.7 మిలియన్ డాలర్ల మొత్తం విలువతో, 158 USD నుండి 158 డాలర్లతో కోహ్లి కంటే ముందున్నాడు.

ఇటు ఆర్ఆర్ఆర్ వంటి దక్షిణాది సినిమాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించటంతో టాలీవుడ్‌కు చెందిన ప్రముఖుల బ్రాండ్ విలువలు పెరిగాయి. 2022లో అల్లు అర్జున్ 31.4 మిలియన్లు కాగా రష్మిక మందనా 25.3 మిలియన్లకు పెరిగింది.

ఇక మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ 80.3 మిలియన్ డాలర్లతో ఆరో స్థానంలో ఉన్నారు. టెండూల్కర్ 73.6 మిలియన్ డాలర్లతో ఎనిమిదో స్థానంలో నిలిచారు. 2023లో పఠాన్‌తో విజయవంతమైన సినిమా చేసిన షారుఖ్ ఖాన్ మొత్తం బ్రాండ్ విలువ USD 55.7 మిలియన్లుగా ఉంది.

  Last Updated: 21 Mar 2023, 09:44 PM IST