Manmohan Singh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan Singh) ఈరోజు కన్నుమూశారు. ఈరోజు అంటే గురువారం అర్థరాత్రి మన్మోహన్ సింగ్ అకస్మాత్తుగా అనారోగ్య కారణాలతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన 92 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో క్రీడా ప్రపంచం విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతి పట్ల పలువురు క్రీడాకారులు సంతాపం వ్యక్తం చేశారు.
మన్మోహన్ సింగ్ మృతి పట్ల వీరేంద్ర సెహ్వాగ్ సంతాపం
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల భారత మాజీ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ సంతాపం వ్యక్తం చేశారు. మన మాజీ ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ జీ మృతికి నా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను అని ఆయన ఎక్స్‌లో రాశారు.
Also Read: ICC Trophies: మన్మోహన్ సింగ్ హయాంలో భారత్ కు 3 ఐసీసీ ట్రోఫీలు
యువరాజ్ సింగ్ సంతాపం
భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కూడా మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ జీ మరణవార్త బాధాకరమని ఆయన పేర్కొన్నారు. భారతదేశ పురోగతి కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన దూరదృష్టి గల నాయకుడు మరియు నిజమైన రాజనీతిజ్ఞుడు. ఆయన వివేకం, వినయం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆయన ప్రియమైన వారికి నా హృదయపూర్వక సానుభూతి అని తెలిపారు యువీ.
దీంతో పాటు భారత మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, వీవీఎస్ లక్ష్మణ్ కూడా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత, మాజీ రెజ్లర్ వినేష్ ఫోగట్ కూడా సంతాపం వ్యక్తం చేశారు.