CWG Hockey Controversy: అంపైరింగ్ తప్పిదంపై భారత్ ఆగ్రహం

కామన్‌వెల్త్‌ గేమ్స్‌ మహిళల హాకీలో భారత్, ఆస్ట్రేలియా సెమీఫైనల్ ఫలితంపై వివాదం నెలకొంది. అంపైరింగ్ తప్పిదాలు ఆస్ట్రేలియాకు విజయాన్నందించాయి.

  • Written By:
  • Publish Date - August 6, 2022 / 04:41 PM IST

కామన్‌వెల్త్‌ గేమ్స్‌ మహిళల హాకీలో భారత్, ఆస్ట్రేలియా సెమీఫైనల్ ఫలితంపై వివాదం నెలకొంది. అంపైరింగ్ తప్పిదాలు ఆస్ట్రేలియాకు విజయాన్నందించాయి. కీలకమైన ఈ మ్యాచ్‌లు అంపైరింగ్ అత్యంత పేలవంగా ఉండడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 0-3 తేడాతో పరాజయం పాలైంది. ఫీల్డ్ రిఫరీలు ఆసీస్ జట్టుకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం భారత్ ఓటమికి కారణమయ్యాయి. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత 1- 1 స్కోరుతో సమం కావడంతో పెనాల్టీ షూటౌట్ కు దారి తీసింది. పెనాల్టీ షూటౌట్ లో ఇండియా ఒక్క పాయింట్ కూడా కొట్టలేకపోగా ఆస్ట్రేలియా మహిళల జట్టు మూడు గోల్స్ చేసి విజయాన్ని అందుకుంది. కాగా ఈ మ్యాచ్ లో తొలి పెనాల్టీ కార్నర్ లో ఆస్ట్రేలియా విఫలమైంది.

పెనాల్టీ టైమ్ క్లాక్ ఆరంభం కాకపోవడంతో ఆస్ట్రేలియాకు మరో ఛాన్స్ ఇచ్చారు. రెండో అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఆస్ట్రేలియా గోల్ కొట్టింది. రిఫరీ నిర్ణయాలపై భారత మహిళలు అభ్యంతరం వ్యక్తం చేశారు.ఆస్ట్రేలియాకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారంటూ ఆరోపించారు. ఈ సంఘటనతో మన మహిళా జట్టు కాన్ఫిడెన్స్ పూర్తిగా దెబ్బతనడంతో తర్వాత గోల్స్ కొట్టలేకపోయారు. అంతకుముందు ఓటమి ఖాయం అనుకుంటున్న తరుణంలో సుశీల చాను గోల్‌తో స్కోర్ సమమై పెనాల్టీ షూటౌట్‌కు దారతీసింది. కాగా ఆడుతున్నది ఒక సెమీఫైనల్‌ మ్యాచ్‌ అని మరిచిపోయి.. క్లాక్‌టైం తప్పిదం అని చెప్పడం సిల్లీగా ఉందని.. అంపైర్‌ కావాలనే ఇలా చేసిందేమో అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ మ్యాచ్‌ వివాదంపై టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌ కూడా అంపైర్‌ తీరుపై ఘాటుగా స్పందించాడు.

ఆస్ట్రేలియాకు పెనాల్టీ మిస్‌ కాగానే అంపైర్‌ పరిగెత్తుకొచ్చి.. సారీ క్లాక్‌ ఇంకా స్టార్ట్‌ చెయ్యలేదు.. మళ్లీ ఆరంభిద్దామా అని సింపుల్‌గా చెప్పేసిందని సెటైర్లు వేసాడు. అంపైర్లు తమకుండే సూపర్‌ పవర్‌తో ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటారనీ, . ఇలాంటివి క్రికెట్‌లో బాగా జరిగేవన్నాడు. అందుకే తాము హాకీలోకి కూడా త్వరలోనే ఎంటరవుతామన్నాడు. ఓడినప్పటకీ మన హాకీ అమ్మాయిలను చూస్తే గర్వంగా ఉందని వీరు ట్వీట్ చేశాడు. మరోవైపు ఈ వివాదంపై అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్‌ కూడా స్పందించింది. భారత్‌కు క్షమాపణలు చెప్పింది. కాగా సెమీఫైనల్లో ఓడినప్పటకీ పతకం గెలిచేందుకు భారత మహిళల జట్టుకు మరో అవకాశముంది. కాంస్యం పతకం కోసం జరిగే మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్‌తో తలపడనుంది.