Site icon HashtagU Telugu

Jimmy Anderson: టెస్టు క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన అండ‌ర్స‌న్‌.. రికార్డులివే..!

James Anderson

James Anderson

Jimmy Anderson: జూలైలో వెస్టిండీస్‌తో సిరీస్‌లో మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడిన తర్వాత తాను రిటైర్ అవుతానని జేమ్స్ ఆండర్సన్ మే 2024లో ప్రకటించాడు. లార్డ్స్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో వెస్టిండీస్‌ను ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 114 పరుగుల భారీ తేడాతో ఓడించింది. దీంతో 2003లో ప్రారంభమైన జేమ్స్ అండర్సన్ (Jimmy Anderson) కెరీర్ ముగిసింది. తన చివరి మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 4 వికెట్లు పడగొట్టాడు. ఆ త‌ర్వాత టెస్టు క్రికెట్‌కు కూడా గుడ్ బై చెప్పాడు.

అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్

ప్రపంచంలో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్‌గా జేమ్స్ అండర్సన్ రిటైర్ అయ్యాడు. 2003లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌తో ప్రారంభమైన తన టెస్టు కెరీర్‌లో అండర్సన్ మొత్తం 188 మ్యాచ్‌లు ఆడాడు. అతని మొత్తం అంతర్జాతీయ కెరీర్‌లో 400 మ్యాచ్‌లలో ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో అతని పేరు మీద మొత్తం 991 వికెట్లు ఉన్నాయి. టెస్టు క్రికెట్‌లో 704 వికెట్లు, వన్డే ఫార్మాట్‌లో 269 వికెట్లు, టీ20 క్రికెట్‌లో 18 వికెట్లు తీశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో ఆటగాడు గ్లెన్ మెక్‌గ్రాత్, అతని పేరు మీద 949 వికెట్లు ఉన్నాయి.

Also Read: Nepal PM Pushpa Kamal Dahal: విశ్వాస పరీక్షలో ఓడిన నేపాల్‌ ప్రధాని.. త‌దుప‌ది ప్ర‌ధాని ఇతనే..?

ఇంగ్లండ్‌కు అత్యధిక టెస్టులు

అయితే టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రికార్డు చిన్ టెండూల్కర్ పేరిట ఉంది. అతని తర్వాత తన 188 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన జేమ్స్ ఆండర్సన్ రెండో స్థానంలో ఉన్నాడు. అండర్సన్ 2003లో తన మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. తరువాతి 21 సంవత్సరాలలో అతను 188 మ్యాచ్‌లు ఆడాడు. ఇంగ్లండ్ తరఫున అత్యధిక టెస్టు మ్యాచ్‌లు ఆడిన రెండో ఆటగాడు స్టువర్ట్ బ్రాడ్. ఇంగ్లండ్ తరపున 167 మ్యాచ్‌లు ఆడాడు. ప్రస్తుత ఆటగాళ్లలో జో రూట్ (141) ఇంగ్లండ్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడాడు.

టెస్టుల్లో 700 వికెట్లు తీసిన తొలి బౌలర్

టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్లలో ముత్తయ్య మురళీధరన్ (800), షేన్ వార్న్ (708) ఉన్నారు. అయితే జేమ్స్ ఆండర్సన్ ఫాస్ట్ బౌలర్‌గా 700కు పైగా టెస్టు వికెట్లు తీసిన ఘనతను ఇంతకు ముందు ఎవరూ సాధించలేకపోయారు. అతని టెస్ట్ కెరీర్ 704 వికెట్లతో ముగిసింది. వెస్టిండీస్‌కు చెందిన జాషువా డి సిల్వా అతని చివరి బాధితుడు అయ్యాడు. ప్రస్తుతం ఏ ఫాస్ట్ బౌలర్ కూడా 400 వికెట్లు కూడా పూర్తి చేయలేకపోయాడు, ఈ క్ర‌మంలోనే 700 వికెట్ల మార్కును దాటడం అసాధ్యమ‌ని క్రీడా పండితులు చెబుతున్నారు.