బీసీసీఐకి త‌ల‌నొప్పిగా మారిన ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్‌?

రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ, రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ మధ్య సంబంధాలు సరిగ్గా లేవు. పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తన హోమ్ గ్రౌండ్‌ను మార్చుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

Published By: HashtagU Telugu Desk
IPL Opening Ceremony

IPL Opening Ceremony

IPL Opening Ceremony: ఐపీఎల్ 2026 ప్రారంభ వేడుకల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. సాధారణంగా ప్రతి ఏటా డిఫెండింగ్ ఛాంపియన్ జట్టు హోమ్ గ్రౌండ్‌లో ఈ వేడుకలు జరుగుతాయి. అయితే ఐపీఎల్ 2025 విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హోమ్ గ్రౌండ్ విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. ఆర్‌సీబీ తన హోమ్ మ్యాచ్‌లను చిన్నస్వామి స్టేడియంలో ఆడుతుందా లేదా అనే దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.

దైనిక్ జాగరణ్ నివేదిక ప్రకారం.. ఆర్‌సీబీ తన మొదటి మ్యాచ్‌ను రాయ్‌పూర్‌లో ఆడాల్సి రావచ్చు. ఇది బీసీసీఐకి పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే నాన్-మెట్రో నగరంలో ప్రారంభ వేడుకలను నిర్వహించడం బోర్డుకు ఇష్టం లేదు. ఇటీవల జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో రెండు ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి.

Also Read: విమ‌ర్శ‌కుల‌కు పెద్దితో చెక్ పెట్ట‌నున్న ఏఆర్ రెహ‌మాన్‌?!

ఒకవేళ ఆర్‌సీబీ తన హోమ్ మ్యాచ్‌లను చిన్నస్వామిలో కాకుండా రాయ్‌పూర్‌లోని డీవై పాటిల్ స్టేడియంలో ఆడితే ప్రారంభ వేడుకలను కూడా అక్కడే నిర్వహించాలి. బీసీసీఐ నాన్-మెట్రో నగరాల పట్ల ఆసక్తి చూపడం లేదు కాబట్టి రెండో ప్రతిపాదనగా గత సీజన్ రన్నరప్ పంజాబ్ కింగ్స్ హోమ్ గ్రౌండ్ అయిన ముల్లాన్‌పూర్‌లో ప్రారంభ వేడుకలను నిర్వహించాలని భావిస్తున్నారు. అదే నివేదిక ప్రకారం.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు తమ హోమ్ మ్యాచ్‌లను తిరువనంతపురంలో నిర్వహించుకోవాలని ఆఫర్ ఇచ్చారు. కానీ బెంగళూరు ఫ్రాంచైజీ ఆ ప్రతిపాదనను తిరస్కరించింది.

రాజస్థాన్ రాయల్స్ అప్‌డేట్

రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ, రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ మధ్య సంబంధాలు సరిగ్గా లేవు. పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తన హోమ్ గ్రౌండ్‌ను మార్చుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. రాజస్థాన్ జట్టు తన 7 హోమ్ మ్యాచ్‌లను పూణే, గౌహతిలలో ఆడే అవకాశం ఉంది. ఐదు రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఐపీఎల్ 2026 షెడ్యూల్‌పై ఇంకా అధికారిక ముద్ర పడలేదు.

  Last Updated: 22 Jan 2026, 10:33 PM IST