Bangladesh: 2026 టీ20 ప్రపంచకప్‌లో తమ మ్యాచ్‌లను భారత్ వెలుపల నిర్వహించాలన్న బంగ్లాదేశ్ డిమాండ్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి తోసిపుచ్చింది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ తమ జట్టును భారత్‌కు పంపేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిరాకరించింది. అయితే వేదికను మార్చాలన్న వారి అభ్యర్థనను ఐసీసీ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. బంగ్లాదేశ్ జట్టు ఖచ్చితంగా భారత్‌కు వచ్చి మ్యాచ్‌లు ఆడాల్సిందేనని తేల్చి చెప్పింది.
ఐసీసీ డిమాండ్‌ను ఎందుకు తిరస్కరించింది?
ఈ అంశంపై ఐసీసీ, బిసిబి మధ్య జరిగిన చర్చల గురించి ఓ నివేదిక పేర్కొంది. ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్ఫో నివేదిక ప్రకారం.. వేదికను మార్చే ప్రసక్తే లేదని ఐసీసీ బంగ్లాదేశ్‌కు స్పష్టం చేసింది. ఒకవేళ బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు రాకపోతే ఆ జట్టు పాయింట్లను కోత విధిస్తామనిహెచ్చరించినట్లు సమాచారం. అయితే తమకు అలాంటి అల్టిమేటం ఏదీ అందలేదని బిసిబి కొట్టిపారేసింది. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ జట్టుకు ఎలాంటి ముప్పు లేదని ఐసీసీ తన భద్రతా సమీక్షలో గుర్తించింది. కాబట్టి మ్యాచ్‌ల వేదికను మార్చడానికి తగిన కారణం ఏదీ లేదని ఐసీసీ భావిస్తోంది.
Also Read: భర్త ప్రొడక్షన్ లో సమంత, ‘బంగారం ‘ లాంటి టైటిల్
బంగ్లాదేశ్ ముందున్న తదుపరి అడుగు ఏమిటి?
భారత్ గతంలో అనేక అంతర్జాతీయ టోర్నమెంట్‌లను అత్యంత సురక్షితంగా నిర్వహించి తన సత్తా చాటుకుంది. కాబట్టి బంగ్లాదేశ్ చేస్తున్న భద్రతా ఆరోపణలకు తగిన ఆధారం లేదు. మరోవైపు ప్రపంచ క్రికెట్‌లో బిసిసిఐ (BCCI) ప్రభావం దృష్ట్యా భారత్‌తో సంబంధాలను చెడగొట్టుకోవడం బంగ్లాదేశ్‌కు నష్టదాయకం కావచ్చు.
బంగ్లాదేశ్ ముందున్న ఎంపికలు ఇవే
షెడ్యూల్ ప్రకారం ముంబై, కోల్‌కతా వేదికల్లో తమ వరల్డ్ కప్ మ్యాచ్‌లు ఆడటం. ఒకవేళ బంగ్లాదేశ్ తన పట్టుదల వదలకపోతే టోర్నమెంట్‌లో వారి పాయింట్లు కోల్పోవాల్సి వస్తుంది. ఒకవేళ టోర్నీ నుండి తప్పుకుంటే ఐసీసీ నుండి వచ్చే రెవెన్యూ వాటా నిలిచిపోవడంతో పాటు భారీ ఆర్థిక జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుంది. చివరికి ఐసీసీ, బిసిసిఐతో సంబంధాలు దెబ్బతినడం బంగ్లాదేశ్ క్రికెట్ భవిష్యత్తుకు ఏమాత్రం మంచిది కాదు.
