Site icon HashtagU Telugu

Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2025.. సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ అవార్డు అందుకున్న వైభ‌వ్ సూర్య‌వంశీ!

Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2025 ముగిసింది. ఫైనల్ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), పంజాబ్ కింగ్స్ మధ్య నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగింది. ఫైనల్‌లో ఆర్‌సీబీ 6 ప‌రుగుల‌ తేడాతో విజయం సాధించి తమ మొదటి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. ఈ టైటిల్ కోసం ఆర్‌సీబీ జట్టు, అభిమానులు 18 సంవత్సరాలు ఎదురుచూశారు. ఈ సీజన్‌లో అనేక యువ అన్‌క్యాప్డ్ ఆటగాళ్లు తమ అద్భుతమైన ప్రదర్శనతో అందరి హృదయాలను గెలుచుకున్నారు. వారిలో రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఒకరు. 14 సంవత్సరాల ఈ యువ ఆటగాడు తన మొదటి ఐపీఎల్ సీజన్‌లో పెద్ద పెద్ద బౌలర్లను ఆటాడుకున్నాడు. దీని కారణంగా అతనికి ప్రత్యేక బహుమతి కూడా లభించింది. అయితే ఈ ప్రత్యేక బహుమతిని ఉపయోగించడం వైభవ్‌కు కష్టంగా ఉండవచ్చు.

వైభవ్‌కు బహుమతిగా టాటా కర్వ్

వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2025లో విజృంభించి 7 మ్యాచ్‌లలో 252 రన్స్ సాధించాడు. ఇందులో ఒక తుఫాన్ శతకం కూడా ఉంది. ఈ సమయంలో అతని స్ట్రైక్ రేట్ 206.55గా ఉంది. ఈ సీజన్‌లో అతను 122 బంతులను ఎదుర్కొని 24 సిక్సర్లు, 18 ఫోర్లు కొట్టాడు. దీంతో వైభవ్‌కు సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ అవార్డు లభించింది. అవార్డుతో పాటు అతనికి బహుమతిగా టాటా కర్వ్ కారు కూడా లభించింది. అయితే వైభ‌వ్ ఈ కారును స్వయంగా నడపలేడు. వైభవ్ వయస్సు 14 సంవత్సరాలు. తక్కువ వయస్సు కారణంగా అతను దీనిని నడపలేడు. భారతదేశంలో కారు నడపడానికి వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి. కాబట్టి వైభవ్‌కు 4 సంవత్సరాలు వేచి ఉండాలి.

Also Read: IPL 2025 Prize Money: ఐపీఎల్ 2025.. ఏ జ‌ట్టుకు ఎంత ప్రైజ్‌మ‌నీ వ‌చ్చిందంటే?

ఆర్‌సీబీ మొదటిసారి టైటిల్ గెలుచుకుంది

ఫైనల్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ మొదట బ్యాటింగ్ చేసి 190 రన్స్ సాధించింది. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ జట్టు 20 ఓవర్లలో 184 రన్స్ మాత్రమే చేయగలిగింది. ఆర్‌సీబీ 6 ప‌రుగుల తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుంది. ఆర్‌సీబీ తరఫున కృనాల్ పాండ్యా అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చేశాడు. పాండ్యా 4 ఓవర్లలో కేవలం 17 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు.

మరోవైపు శశాంక్ సింగ్ పంజాబ్ కింగ్స్‌ను గెలిపించడానికి చాలా ప్రయత్నించాడు. చివరి ఓవర్‌లో పంజాబ్‌కు గెలవడానికి 30 రన్స్ అవసరం ఉండగా శశాంక్ జోష్ హాజెల్‌వుడ్ ఓవర్‌లో 24 రన్స్ కొట్టాడు. ఈ మ్యాచ్‌లో శశాంక్ 30 బంతుల్లో 60 రన్స్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. కానీ పంజాబ్‌ను గెలిపించలేకపోయాడు.