Site icon HashtagU Telugu

Sachin Tendulkar: ఆ రాత్రి అలా గడిపాను.. సచిన్ టెండూల్కర్ షాకింగ్ కామెంట్స్?

118972 Ujnzmdppwq 1557029068

118972 Ujnzmdppwq 1557029068

Sachin Tendulkar: మామూలుగా మరుసటి రోజు ఏదైనా ఉందంటే కొన్ని కొన్ని సార్లు ముందు రోజు రాత్రి నిద్ర పట్టడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఇటువంటివి చాలావరకు అందరికీ ఎదురవుతూనే ఉంటాయి. అయితే గతంలో సచిన్ టెండూల్కర్ కి కూడా అటువంటిదే ఎదురయింది. 2003లో వన్డే ప్రపంచ కప్ లో పాకిస్తాన్ పై సచిన్ చివరి ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే.

తాజాగా ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొని పాత విషయాలను మరోసారి ఎవరు వేసుకున్నాడు. 2003 వన్డే ప్రపంచ సందర్భంగా భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ కు ముందు తనకు నిద్ర కూడా కరువైందని అన్నాడు. భారత్ – పాకిస్తాన్ జెట్ల మధ్య మ్యాచ్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగా ఉంటుందని.. అటువంటి మ్యాచ్ కు ముందు తాను నిద్రపోలేదు అని తెలిపాడు.

ఇతర మ్యాచుల్లో గెలిచిన గెలవక పోయిన పర్వాలేదు కానీ.. పాకిస్తాన్ పై టీం ఇండియా గెలవాలని అభిమానులు బలంగా కోరుకుంటారు అంటూ.. అందుకే ఇటువంటి మ్యాచ్పై అంచనాలు, ఒత్తిడి తీవ్రస్థాయిలో ఉంటాయని అన్నాడు. ఇక షోయబ్ బౌలింగ్ లో కొట్టిన సిక్స్ తన జీవితంలో ప్రత్యేకమైన షాట్ అని.. అయితే ఇటువంటి షాట్ కొట్టాలన్న ముందస్తు ప్రణాళికతో బరిలోకి దిగలేదు అని అన్నాడు.

బంతి గమనాన్ని అంచనా వేస్తూ అప్పటికప్పుడు అలాంటి షాట్ ఆడాలి. ఆ మ్యాచ్ లోని ఇదే జరిగిందని.. బంతి ఆఫ్ సైడ్ కు ఆవల వెళుతున్నట్లు అనిపించింది. వెంటనే షాట్ కొట్టేందుకు ప్రయత్నించాను అని.. అది సిక్స్ గా వెళ్ళిపోయింది అని తెలిపాడు. ఇక ఇప్పుడున్న క్రికెట్ గురించి మాట్లాడుతూ.. ఇప్పుడు మనమంతా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. టెస్టు క్రికెట్ పై ఆసక్తిగా ఉండాలి తప్ప.. ఎన్ని రోజుల్లో అంతర్దానం అవుతుందనే అంశం గురించి అసలు చర్చించ కూడదు అంటూ.. టెస్టు క్రికెట్ మరింత ఆసక్తిగా మారాలంటే వెరీ వెరీ పిచ్ పరిస్థితులపై ఆడాలి అని అన్నాడు.

పేస్, స్వింగ్, స్పిన్ ఇలా విభిన్నంగా బంతులను ఎదుర్కోవాలి అంటూ.. అప్పుడే టెస్టు క్రికెట్ పై ఆటగాళ్లలోనూ, అభిమానులల్లోనూ ఆసక్తి పెరుగుతుంది అని.. ఇప్పుడున్న మరో రెండు ఫార్మాట్లు బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది అని.. టీ20 లో ప్రతి బంతిని కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ.. ఇప్పుడున్న నిబంధనలు ప్రకారం వన్డేలోనూ 320 పరుగులు అంటే సాధారణ స్కూల్ గా మారిపోయింది అని అన్నాడు.