Bumrah : బూమ్రా.. ఇదేం ఫీల్డింగ్ సెటప్

ఇంగ్లాండ్ తో చివరి టెస్టులో భారత్ పరాజయంతో సిరీస్ గెలిచే సువర్ణావకాశం చేజారిపోయింది.

  • Written By:
  • Updated On - July 5, 2022 / 09:22 PM IST

ఇంగ్లాండ్ తో చివరి టెస్టులో భారత్ పరాజయంతో సిరీస్ గెలిచే సువర్ణావకాశం చేజారిపోయింది. రెండో ఇన్నింగ్స్ లో అనూహ్యంగా చెలరేగిన ఇంగ్లాండ్ 378 పరుగుల టార్గెట్ ను ఊదిపారేసింది. అయితే ఈ మ్యాచ్ కు రోహిత్ శర్మ కోవిడ్ కారణంగా దూరం కావడంతో సారథ్య బాధ్యతలు స్వీకరించిన జస్ప్రీత్ బుమ్రాపై పలువురు మాజీలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంగ్లాండ్ మాజీ సారథి పీటర్సన్.. బుమ్రా కెప్టెన్సీ వ్యూహాలను తప్పుపట్టాడు.నాలుగోరోజు ఆటలో బుమ్రా వ్యూహాలు ఫలించినట్లు తనకు అనిపించలేదన్నాడు. బంతి రివర్స్ అవుతున్నప్పుడు భారత ఆటగాళ్ల ఫీల్డింగ్ సెటప్ సరిగ్గా లేదన్నాడు. బంతి రివర్స్ అవుతున్నప్పుడు బ్యాటర్ అంత సులభంగా బ్యాటింగ్ చేయలేడనీ, ఆ సమయంలో షాట్లు ఆడేందుకు నాన్ స్ట్రైకంగ్ ఎండ్ సరైన చోటన్నాడు. అక్కడ సరిగ్గా ఫీల్డింగ్ ప్లేస్మెంట్ ఉన్నట్లయితే మ్యాచ్ నాలుగోరోజే ముగిసేదంటూ విశ్లేషించాడు. బూమ్రా కెప్టెన్సీ వ్యూహాలు ఏమాత్రం అంతర్జాతీయ స్థాయికి తగినట్టు లేవని పీటర్సన్ విమర్శించాడు. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌ జరుగుతున్నప్పుడు ఎక్కువ సేపు ఔట్ ఫీల్డ్ ప్రొటెక్షన్ లేదని పీటర్సన్ చెప్పుకొచ్చాడు. రూట్, బెయిర్ స్టోలకు ఎక్కువసేపు లాంగాన్, లాంగాఫ్ దొరిదిందన్నాడు. అలా బౌలింగ్ చేయడం వల్ల ఇంగ్లాండ్ బ్యాటర్లకు బాగా కలిసొచ్చిందన్నాడు. ఈ మ్యాచ్ లో చివరిరోజు కూడా భారత బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఏదో అద్భుతంగా చేస్తారని ఆశించినా… కనీసం ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు. ఫలితంగా ఇంగ్లాండ్ బ్యాటర్లు జో రూట్, బెయిర్ స్టో శతకాలతో దుమ్మురేపారు. రూట్ . బెయిర్ స్టో పార్టనర్ షిప్ తో మ్యాచ్ పూర్తి వన్ సైడ్ గా మారిపోయింది. పూర్తి ఎటాకింగ్ బ్యాటింగ్ తో అదరగొట్టిన రూట్, బెయిర్ స్టోను ఏ దశలోనూ భారత బౌలర్లు ఇబ్బంది పెట్టలేకపోయారు. ఫలితంగా భారీ టార్గెట్ ను అలవోకగా ఛేదించిన ఇంగ్లాండ్ జట్టు సిరీస్ ను కూడా కాపాడుకుంది.