Site icon HashtagU Telugu

Asia Cup Women: వరుణుడి దెబ్బకు బంగ్లా సెమీస్ బెర్త్ గల్లంతు

Matchhh

Matchhh

మహిళల ఆసియా కప్‌ లో ఆతిథ్య బంగ్లాదేశ్‌కు వరుణుడు షాక్ ఇచ్చాడు. వర్షం వరణుడు కారణంగా ఆ జట్టు సెమీస్‌ బెర్త్ చేజారింది. చివరి సెమీస్ బెర్త్ కోసం బంగ్లాదేశ్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ మహిళా జట్ల మధ్య మ్యాచ్‌ జరగాల్సి ఉండగా.. వర్షం ఆటంకం కలిగించింది. ఎడతెరిపి లేకుండా వాన కురుస్తూనే ఉండటంతో ఈ మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.
దీంతో బంగ్లా, యూఏఈ జట్లకు చెరో పాయింట్‌ లభించింది. మొత్తంగా 5 పాయింట్లు మాత్రమే సాధించిన బంగ్లా గ్రూప్‌ దశలో ఐదో స్థానంలో నిలిచిపోయింది. మరోవైపు.. పాకిస్తాన్‌పై సంచలన విజయంతో చరిత్ర సృష్టించిన థాయ్‌లాండ్‌ ఆరు పాయింట్లతో సెమీస్‌కు అర్హత సాధించింది. దీంతో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు బంగ్లాదేశ్‌ ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది. కాగా భారత్‌, పాకిస్తాన్‌, శ్రీలంకతో బంగ్లాదేశ్ సెమీస్ కు చేరాయి. అక్టోబరు 13న సెమీ ఫైనల్స్‌ , 15న ఫైనల్‌ జరుగనుంది.