Site icon HashtagU Telugu

IPL : ఐపీఎల్ ఫ్యాన్స్ కు TGSRTC గుడ్ న్యూస్

Tgsrtc Uppal Matches

Tgsrtc Uppal Matches

క్రికెట్ అభిమానుల కోసం టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) ప్రత్యేక సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం (Uppal Stadium)లో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌లను (IPL Matches) వీక్షించడానికి ప్రత్యేక బస్సు సేవలను అందిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 బస్సు డిపోల నుంచి మొత్తం 60 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగే రోజుల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. తద్వారా అభిమానులు సౌకర్యంగా స్టేడియంకు చేరుకోవచ్చు.

Bank Account Nominees : ఇక ఖాతాకు నలుగురు నామినీలు.. ‘బ్యాంకింగ్’ బిల్లుకు ఆమోదం

ఉప్పల్ స్టేడియంలో మార్చి 27 నుంచి మే 21 వరకు ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో క్రికెట్ ప్రియులకు ఎలాంటి ప్రయాణ అసౌకర్యం కలగకుండా టీజీఎస్ఆర్టీసీ ముందస్తు ప్రణాళికతో బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ముఖ్యంగా ఏప్రిల్ 6, 12, 23, మే 5, 10, 20, 21 తేదీల్లో ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ మ్యాచ్‌లకు హాజరయ్యే ప్రేక్షకుల కోసం ప్రత్యేక బస్సులు ప్రత్యేక షెడ్యూల్ ప్రకారం నడపనున్నారు.

ఘట్‌కేసర్, హయత్ నగర్, ఎల్బీనగర్, ఎన్జీవోస్ కాలనీ, కోఠి, లక్డీకాపూల్, దిల్‌సుఖ్ నగర్, మేడ్చల్, కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు, మియాపూర్, జేబీఎస్, చార్మినార్, బోయినపల్లి, చాంద్రాయణగుట్ట, మెహిదీపట్నం, బీహెచ్ఈఎల్ తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నారు. మ్యాచ్‌లు ముగిసిన తర్వాత కూడా వీటిని తిరుగు ప్రయాణం కోసం అందుబాటులో ఉంచనున్నారు. క్రికెట్ అభిమానులు ఈ ప్రత్యేక సౌకర్యాన్ని వినియోగించుకుని మ్యాచ్‌లను ఎలాంటి సమస్యలు లేకుండా ఆస్వాదించాలని టీజీఎస్ఆర్టీసీ అధికారులు సూచిస్తున్నారు.